గత ప్రభుత్వంలో ధరణితో రైతులు దగాపడ్డారు!

👉 రైతుల సౌలభ్యం కోసమే భూభారతి చట్టం !

👉 పెగడపల్లి మండలంలో రైతుల కోసం ₹ 52.75 కోట్లు పంపిణీ చేశాం !

👉 ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


గత బిఆర్ఎస్ ప్రభుత్వం ధరణి చట్టంతో రైతులను ఇబ్బందుల గురిచేస్తూ దగా చేసిందని, మా కాంగ్రెస్ ప్రజా పాలన లో రైతులు సంతోష పడుతున్నారని, రైతుల సౌలభ్యం కోసమే భూభారతి చట్టం తెచ్చామని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్  అన్నారు.


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి  (కొత్త ఆర్ఓఆర్ చట్టం) పై పెగడపెల్లి మండల కేంద్రంలో మంగళవారం  ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో  ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్  కలెక్టర్ సత్య ప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు.


👉 ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..


గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి వ్యవస్థ వల్ల రైతులు తమ వ్యవసాయ భూములను తాము అమ్ముకునే పరిస్థితి లేదని, ఒకరి భూమి మరొకరికి పేరు మీద ధరణిలో ఇష్టానుసారంగా నమోదు చేస్తూ అర్హత కలిగిన రైతులను నాటు ప్రభుత్వం దగా చేసిందన్నారు.


ప్రభుత్వం సృష్టించిన రైతుల సమస్యలు పరిష్కారం కోసం  భవిష్యత్తులో ఎలాంటి భూ సమస్యలు ఏర్పడవద్దు అనే ఉద్దేశంతో మా ప్రభుత్వం భూ భారతి నూతన రెవిన్యూ చట్టాన్ని తెచ్చిందని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ఈ చట్టం ద్వారా రైతులు ఎదుర్కొన్న ప్రతి సమస్య పరిష్కారం అవుతుందని, అన్నారు.


👉 పెగడపల్లి మండల రైతులకు ₹ 52.75 కోట్లు !
కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వంలో ఒక్క పెగడపల్లి మండలంలోని రైతుల సంక్షేమం కోసం ₹ 52 కోట్ల 75 లక్షల 66 వేల లబ్ది  చేకూర్చిందన్నారు.


👉 రైతు భరోస,  11287 రైతులకు ₹ 7 కోట్ల 38 లక్షల 88 వేల జమ !


👉 రైతు భీమ – 2024-25 – సంవత్సరకాలానికి 41 మంది రైతులు చనిపోగా ఒకొక్కరి ₹ 5 లక్షల చొప్పున మొత్తం ₹ 2కోట్ల 5 లక్షలు జమ !


👉 వరి  బోనస్ (వానాకాలం) 180 రైతులకు ₹ 27లక్షల 89వేలు జమ !


👉 రైతుల రుణమాఫీ ₹ 2 లక్షల చొప్పున 5611 మంది రైతులకు ₹ 43 కోట్ల 3 లక్షల 89 వేల రూపాయల మాఫి వివరాలను ఎమ్మెల్యే సదస్సులో వివరించారు.


ఇందిరమ్మ ఇళ్లను  అర్హులైన పేదవారికి అందజేస్తామని, లిస్టులో పేర్లు రాని వారు అధైర్య పడాల్సిన అవసరం లేదని, అర్హత ఉన్న ప్రతి వారికి ఇళ్లు ప్రభుత్వం కట్టి ఇస్తుందని, ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.