👉 వైద్య శిబిరాన్ని సందర్శించిన. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు !
J.SURENDER KUMAR,
.గ్రామీణ ప్రాంతాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ముమ్మరంగా సేవా కార్యక్రమాలు అవసరమని అందుకే చేపడుతున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగం శ్రీనివాసరావు అన్నారు. వైద్య శిబిరాన్ని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావ్ సందర్శించారు.
శుక్రవారం చిన్న శంకరంపేట మండల కేంద్రంలో తుప్రాన్ వి ఎస్ టి ఇండస్ట్రీస్ సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరoలో పాల్గొని ప్రసంగించారు.
గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.. చిన్న శంకరంపేట గ్రామంలో మెగా వైద్య క్యాంపును నిర్వహించడం శుభ పరిణామం అన్నారు.

అనంతరం రెడ్ క్రాస్ సోసైటీ జిల్లా చైర్మన్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి, మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు DEME యాదగిరి మాట్లాడుతూ,
జిల్లాలో వివిధ ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు, మెగా వైద్య క్యాంపులు, ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. చిన్న శంకరంపేట గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య మెగా క్యాంపుకు అక్కడి ప్రజల నుండి మంచి స్పందన లభించింది. మేడ్చల్ మెడిసిటీ ఆసుపత్రికి చెందిన డాక్టర్లు ప్రవళిక, సంజన, నీరజ, దీక్షిత, సుప్రియ, సౌజన్య, హర్ష, తేజస్విని, హన్సిక శిబిరములో పాల్గొని పేషెంట్లకు వైద్య సేవలు అందించారు.
అంతేకాకుండా పి హెచ్ సి కి చెందిన డాక్టర్లు B. హృదయ్ మెడికల్ సిబ్బంది కుమారి, నందిని, బుజ్జి, మాల, మాధవి, లలిత, రేణుకా పాల్గొన్నారు.

అనంతరం ఉచితంగా మందులను పంపిణీ చేశారు. సుమారు 100 మందికి పైగా రోగులు వివిధ రకాల పరీక్షలను చేయించుకున్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా కార్యదర్శి టి సుభాష్ చంద్రబోస్, కోశాధికారి డి.జి.శ్రీనివాస శర్మ, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు దేమే యాదగిరి, రేషన్ డీలర్ తోట శ్రీనివాస్ గుప్తా, మద్దెల సత్యనారాయణ, జీడి తిరుపతి, N. మాధవరెడ్డితొ పాటు గ్రామస్తులు పాల్గొన్నారు
👉 రెడ్ క్రాస్ సేవల పట్ల ఎమ్మెల్యే హర్షం !

మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మెగా వైద్య ఆరోగ్య శిబిరాన్ని సందర్శించారు. రెడ్ క్రాస్ సంస్థ వారు గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయం అన్నారు. చిన్న శంకరంపేట లో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో చేపట్ట బోయే కార్యక్రమాలకు తమ సహకారం ఉంటుందని తెలిపారు