J.SURENDER KUMAR,
గ్రామీణ ప్రాంతాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని నిజాంపేట సబ్ ఇన్స్పెక్టర్ బండి రాజేష్ అన్నారు.
మంగళవారం నిజాంపేట మండల కేంద్రంలో తుప్రాన్ వి ఎస్ టి ఇండస్ట్రీస్ సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అనంతరం ఎస్సై మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
నిజాంపేట గ్రామంలో మెగా వైద్య క్యాంపును నిర్వహించడం శుభ పరిణామం అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను మళ్లీ నిజాంపేట మండలంలో కొనసాగిస్తే తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు.

అనంతరం రెడ్ క్రాస్ సోసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగం శ్రీనివాసరావు, జిల్లా చైర్మన్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు, మెగా వైద్య క్యాంపులు, ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కాగా నిజాంపేట గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య మెగా క్యాంపుకు అక్కడి ప్రజల నుండి మంచి స్పందన లభించింది.
మల్లారెడ్డి ఆసుపత్రికి చెందిన డాక్టర్లు ఉమేష్ రఘు ప్రసాద్, సాయి సురమి, అభినవ్, చంద్రశేఖర్, అరుణ్ కాంత్ రెడ్డి, ప్రణీత, శ్రీ చరిత్ర
శిబిరములో పాల్గొని పేషెంట్లకు వైద్య సేవలు అందించారు. ఉచితంగా మందులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రమ్యశ్రీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రీతి, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కోశాధికారి డి. జి . శ్రీనివాస శర్మ, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు దేమే యాదగిరి, మద్దెల సత్యం, దామోదర్ రావు, లక్ష్మణ్ యాదవ్ , వంగరీ కైలాస్ ,తోట శ్రీనివాస్, N. మాధవరెడ్డి, G తిరుపతి, G స్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రావిపల్లి అమర సేవా రెడ్డి, పంజ మహేందర్, సుధాకర్ తో పాటుగా నరేందర్ , వినయ్ గౌడు, S. తిరుపతి, మహేష్, తమ్ములి రమేష్
తదితరులు పాల్గొన్నారు.