హమాలీ కుటుంబానికి అండగా ఉంటా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన హమాలి మేడవేనీ శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉంది ఆదుకుంటానని ధర్మపురి ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్  అన్నారు.

ధర్మారం మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో హమాలిగా విధులు నిర్వహిస్తున్న మెడవేని శ్రీనివాస్, మంగళవారం ప్రమాదవశాత్తు లారీపై నుండి పడి మృతి చెందాడు.

ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్,  శ్రీనివాస్  మృతదేహానికి నివాళులర్పించి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.
శ్రీనివాస్ దహన సంస్కారాలకు ₹ 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని  కుటుంబానికి అందించారు.
కలెక్టర్ తో ఎమ్మెల్యే  శ్రీనివాస్ మృతి చెందిన తీరును ఫోన్ ద్వారా వివరించారు. సింగిల్ విండో సొసైటీ ద్వారా ₹ 5  లక్షల రూపాయలు,  వ్యవసాయ మార్కెట్ ద్వారా ₹ 2 లక్షల రూపాయలు మృతుడి కుటుంబానికి అందించాల్సిందిగా ఎమ్మెల్యే కోరారు.

ప్రభుత్వం పక్షాన ఇందిరమ్మ ఇళ్లును  మంజూరు చేస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.

👉 క్రీడా స్టేడియం ఏర్పాటు చేయండి !

గొల్లపల్లి మండలంలో మినీ క్రీడా స్టేడియం ఏర్పాటు చేయాలని మంగళవారం మండల యువత, క్రీడాకారులు, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ భూమి  సర్వే నెంబర్ 735  అనుకూలంగా ఉందని విజ్ఞాపకంలో వారు పేర్కొన్నారు.  సాధ్యా సాధ్యాల పరిశీలించి వివాదాలు లేని స్థలం ఎంపిక చేస్తానని ఎమ్మెల్యే యువతకు హామీ ఇచ్చారు.