ఇంచు భూమి ప్రభుత్వం తీసుకోలేదు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క !

👉 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదంలో.. !


J.SURENDER KUMAR,


హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమికి సంబంధించిన అంశంలో  కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు అని యూనివర్సిటీకి చెందిన ఇంచు భూమి ప్రభుత్వం తీసుకోలేదు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క.


హైదరాబాద్ సచివాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క  మంత్రులు శ్రీధర్ బాబు ,మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ భూమిని కాపాడిందని దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేసిన చర్యలను వివరించి, ప్రజలకు ఉన్నత విద్యా సంస్థలకు అవసరమైన భూమి సంరక్షణపై వారు మద్దతు ప్రకటించారు.
కొన్ని పార్టీల అనుబంధ సంఘాలు ఈ అంశాన్ని తప్పు దోవపట్టిస్తున్నాయి..

గందరగోళం సృష్టించడానికి బీజేపీ, బీఆర్ఎస్‌ ప్రయత్నాలు. చేస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
వారం రోజుల క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ తో (వీసీతో) ప్రభుత్వం సంప్రదింపులు చేసింది అన్నారు.


యూనివర్సిటీ కి చెందిన భూమి యూనివర్సిటీకే ఉండాలని వైస్‌ ఛాన్సలర్‌కి చెప్పాం అని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.