J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జిల్లా అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో “సమ్మర్ యాక్షన్ ప్లాన్ – 2025” మరియు “ఇందిరమ్మ ఇల్లు పథకం” అమలుపై సమీక్షించారు.
కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ, వేసవి కాలంలో ప్రజలకు త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, మండలాల వారిగా మరియు గ్రామాల వారిగా చివరి ఇంటి వరకు అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే, మండలాల వారీగా వేసవి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు.
దీంతోపాటు జగిత్యాల జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో ఇందిరమ్మ ఇండ్లు సొంత స్థలంలో దరఖాస్తులు చేసుకున్నావారికి మండల స్పెషల్ ఆఫీసర్లుగా కమిటీ ఏర్పాటులు చేసుకోవాలని పథకం క్రింద అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తిచేయాలని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ సూచించారు.
నిధుల విడుదల, పనుల పురోగతి తదితర అంశాలపై కూడా అధికారులతో సమీక్ష జరిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, ఆర్డిఓ లు మధుసూదన్, జివాకర్ రెడ్డి, శ్రీనివాస్ మరియు జిల్లా పంచాయతీ అధికారి మదన్ మోహన్ మిషన్ భగీరథ ఈ ఈ ఏంట్రా రమేష్ డి ఈ లు ఏఈలు మరియు హౌసింగ్ డి ప్రసాద్ . హౌసింగ్ . డీలు ఏ ఈ లు మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీవోలు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు పాల్గొన్నారు