25 ఏళ్ల క్రితమే కరీంనగర్ జిల్లాలో ఉగ్రవాద కదలికలు !

👉 నాడే జగిత్యాలలో  ఐ. ఎస్. ఐ  ఉగ్రవాది కాల్చివేత !

👉 జమ్ము కాశ్మీర్ లో కాల్పులలో 28 పర్యటకుల మృతితో రంగంలోకి N.I.A.

J.SURENDER KUMAR,

25 సంవత్సరాల క్రితమే ఐ ఎస్ ఐ ( పాకిస్తాన్ ) ఉగ్రవాదుల కదలికలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలకలం సృష్టించాయి. మంగళవారం జమ్ము కాశ్మీర్ పహల్గామ్‌లో పాకిస్తాన్ ముష్కరులు సృష్టించిన మారణ హోమం లో 28 పర్యటకుల మృతి  పలువురికి గాయాలైన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఉగ్రవాదంను పెంచి పోషిస్తున్న దాయాది దేశం పాకిస్తాన్ పై పలు ఆంక్షలు విధించడం తోపాటు,   నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నీ ( NIA ) రంగంలోకి దింపింది.


👉 25  ఏళ్ల క్రితమే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఐ ఎస్ ఐ కదలికలు !

జగిత్యాల పట్టణంలో పాకిస్తాన్ ఉగ్రవాది  (ఐ ఎస్ ఐ దక్షిణాది  కమాండర్ ) ఆజాంగోరి నీ 2000 సంవత్సరం ఏప్రిల్ మొదటి వారంలో  అప్పటి నిజామాబాద్ ఎస్పీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో జగిత్యాల లో ఆజాంగోరి ఎన్కౌంటర్ జరిగింది.

ఐ ఎస్ ఐ ఉగ్రవాది అజమ్ గోరి (ఫైల్ ఫోటో)

👉 కామ్ గా కదలికల గుర్తింపు !

ప్రస్తుతం జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర సినిమా హాల్ లో 2000 ఫిబ్రవరి మొదటి వారంలో బాంబు పేలింది. ఈ సంఘటనలో ప్రాణ నష్టం జరగకపోవడంతో పోలీసులు ముందుగా ఉత్తుత్తి  బాంబు, ఆకతాయి పిల్లలు దీపావళి టపాసులు  పేల్చారు అంటూ భావించారు. ల్యాబ్ నివేదికలో పేలుడుకు, అమోనియా నైట్రేట్ రసాయనం వాడినట్టు తేలడంతో  పోలీస్ యంత్రాంగం ఉలిక్కిపడింది.
ఇదే తరహాలో మహారాష్ట్ర , ఆదిలాబాద్, నిర్మల్, హైదరాబాద్, నిజాంబాద్ సినిమా థియేటర్లలో పేలుళ్లు జరిగాయి.

👉 నిజామాబాద్ పోలీసుల నిఘా తో…

నిజామాబాద్ లో ఓ నేరంలో పట్టుబడ్డ యువకుడిని పోలీసులు తమదైన స్టైల్ లో విచారణ జరిపారు. ఆ విచారణలో యువకుడు వెల్లడించిన వివరాల ఆధారంగా ఉగ్రవాద కార్యకలాపాల కదలికల సమాచారం అప్పటి నిజాంబాద్ ఎస్పీ రవిశంకర్ అయ్యనార్, తెలిసింది. ఈ మేరకు  ఆయన జగిత్యాల పై దృష్టి పెట్టి. ఐ ఎస్ ఐ ఆజాం గోరి  కదలికల పై కీలక సమాచారం సేకరించారు.

👉 ఎన్కౌంటర్ లో పాల్గొన్న ఎస్పీ రవిశంకర్ అయ్యనార్ !

జగిత్యాల కొత్త బస్టాండ్ పెట్రోల్ పంపు నుండి ఆర్టీసీ డిపో వరకు రోడ్డుకు ఇరువైపులా నిజామాబాద్ పోలీసులు మారు వేషాలతో, ఏదో వ్యాపారం చేస్తున్నట్టు షార్ట్ వెపన్స్ తో మాటు వేశారు.  తమ టార్గెట్ వ్యక్తిని పట్టుకోవడానికి, లేదా ఎన్కౌంటర్ కోసం  నాలుగు ఎన్కౌంటర్ జోన్ లు ఏర్పాటు చేసుకుని పోలీసులు వేచి చూశారు.

ఆర్టీసీ డిపో సమీపాన గల తుమ్మ చెట్లలో ఓ వ్యక్తితో ఆజాంగోరి సమావేశం తేదీ, సమయం  పోలీసులకు ముందస్తుగా సమాచారం ఉంది. రోడ్డు పక్కన టాటా సుమో వాహనంలో ఎస్పీ మరికొందరు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పోలీసులు టార్గెట్ వ్యక్తి కోసం కోసం ఎదురుచూస్తున్నారు.

👉 సైకిల్ పై ..

సైకిల్ పై ముందర బుట్టలో దువ్వెల్లో, కాటుక డబ్బాలు, పిన్నిసులు, రిబ్బన్లు  విక్రయించే వాడిగా సైకిల్  పై ఆజాంగోరి ఆర్టీసీ డిపో వైపు వస్తున్నాడు. పక్కా సమాచారంతో  పోలీసులు ఆజాంగోరి నీ రోడ్డుపై చుట్టుముట్టారు. సైకిల్ ముందర బుట్ట లోపల ఉన్న  రివాల్వర్ ను ఆజాంగోరి తీసే యత్నంలో  ఎన్కౌంటర్ జరిగింది.


హతమైన ఆజాంగోరి  వద్ద దొరికిన సమాచారం మేరకు విదేశాలకు జగిత్యాల నుంచి  చేసిన ఫోన్ కాల్స్ వివరాలు, కీలక సమాచారం పోలీసులు సేకరించారు.  12 సంవత్సరాల పాటు అజ్ఞాతంలో ఉంటూ పలు కేసులకు బాధ్యుడైన ఆజామ్ గోరి ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా నాడు సంచలనం సృష్టించింది.

👉 4 రోజుల తర్వాత స్తావరాన్ని గుర్తించిన పోలీసులు !

ఎన్కౌంటర్ ప్రదేశంలో గోరి వద్ద రివాల్వర్, ఓ తాళం చెవినీ పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. నాలుగు రోజులపాటు జగిత్యాల పట్టణంలో తాళం వేసిన ఇళ్లను తాళం చెవితో  తెరవడానికి పోలీసులు ప్రయత్నించారు. ఓ ఇంటి తాళం తెరుచుకోవడంతో. అందులో బాంబులు, పేలుడు పదార్థాలు, బాంబుల తయారీకి ఉపయోగించే పరికరాలు, సాహిత్యాన్ని   పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. అజామ్ గోరి సైతం  అమోనియా నైట్రేట్ తోనే అనేక బాంబులు తయారు చేసినట్టు గుర్తించారు.

ఇది ఇలా ఉండగా ఈ జిల్లాలోనే గుజరాత్ మంత్రి హరేన్ పాండ్య హత్య కేసులో నిందితుడైన వ్యక్తిని దశాబ్దన్నర కాలం క్రితం గుజరాత్ పోలీసులకు జగిత్యాల్ పట్టణంలో చిక్కాడు. భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు  ఉగ్రవాద సంఘటనలు, ప్రాంతాలు, తదితర పూర్తి వివరాల నివేదిక ను పోలీస్ యంత్రాంగం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి (NIA) త్వరలో  అప్పగించనున్నారు.