👉 కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కి విన్నపం !
👉 మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ !
J.SURENDER KUMAR,
జగిత్యాల నుండి కరీంనగర్ నేషనల్ హైవే “563” నాలుగు లైన్ల రహదారి పనులు త్వరితగతిన పూర్తి చేయండి అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి , కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కి జగిత్యాల మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ విజ్ఞప్తి చేశారు.
జగిత్యాల పట్టణ మరియు కరీంనగర్ పట్టణాన్ని కలుపుతూ ఉన్న మండలాల ప్రజలు మరియు గ్రామాల ప్రజల దశాబ్దాల కల అయినటు వంటి ఈ రోడ్డును 2014 లో గుర్తించినప్పటికీ గతంలో పార్లమెంటు సభ్యుడు పట్టించు కోకపోవడంతో B.J.P. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థిగా మీరు కరీంనగర్ M.P గా గెలవడంతో ఇక్కడి ప్రజలు అందరు కూడ మా కల నేరవేరుతుందని భావించారని విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు.
ప్రధాన మంత్రిగా 3 వ సారి నరేంద్ర మోడీ” బాద్యతలు తీసుకున్న “100” రోజుల ప్రణాళికలో భాగంగా ప్రమాదకరముగా ఉన్న రోడ్లు నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా రోడ్లను గుర్తించిన రోడ్లలో మన జగిత్యాల నుండి కరీంనగర్ రోడ్డును గుర్తించి “100” రోజుల లోపు పనులు మొదలు పెట్టాలని ఆదేశించిన నేటికీ పనులు మొదలు కాక పోవటం చాల బాధాకరం. అని పేర్కొన్నారు.

ఇప్పటి వరకు పూర్తిస్థాయి భూసేకరణ జరగలేదని, నాలుగు సార్లు టెండర్లు పిలిచినారని వాటిని రద్దు పరుస్తు వస్తున్నారు. ఈ రోడ్డు అయ్యే ఖర్చు మొదటి అంచనా ₹ 1503 కోట్ల రూపాయలుగా తిరిగి మళ్ళీ టెండర్ అంచనా వేయగా ₹ 2,151కోట్లకు అంచనా, June, 2024 నాటికి అంచనా విలువ ₹ 2, 300 కోట్ల రూపాయలకు చేరుకుంది వినతి పత్రంలో వివరించారు.
నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉండే ఈ రహదారిలో నిత్యం ఒక రోడ్డు ప్రమాదం జరుగుతూ కొన్ని వందల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మీరు ఇప్పటికైనా పూర్తి స్థాయి బాద్యతగా తీసుకొని సమయాన్ని వెచ్చించి భూసేకరణ పూర్తి చేసి టెండర్లు పిలిచి పనులు ప్రారంబించే విధంగా చర్యలు చేపట్టాలని జగిత్యాల ప్రజలు మరియు జగిత్యాల నుండి కరీంనగర్ వరకు ఉన్న ప్రజలందరి పక్షాన కోరుచున్నట్టు మాజీ కౌన్సిలర్ జయశ్రీ వినతి పత్రంలో పేర్కొన్నారు.