J.SURENDER KUMAR,
జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఏర్పాటుకు శనివారం ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు కలెక్టర్ సత్యప్రసాద్ స్థల పరిశీలన చేశారు.
పట్టణంలోని మంచినీళ్ల బావి చౌరస్తా వద్ద స్థలం పరిశీలించారు.

ఈ సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…
మహానేత బాబు జగ్జీవన్ రామ్ సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయం. సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ముందు తరాలకు ప్రేరణగా ఉంటుందని ప్రజల కోరిక మేరకు జగిత్యాల పట్టణంలో ప్రభుత్వ నిబంధనల క్రమం గా ఏర్పాటు చేస్తామని అన్నారు. స్థల పరిశీల న దళిత , అంబేద్కర్ సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.