జగిత్యాల మామిడి రైతులకు దళారులు బెడద !

👉 దళారులు చెప్పిందే ధర

👉 న్యాయం కోసం  ప్రజావాణిలో కలెక్టర్ కు రైతు ఐక్యవేదిక వినతి !


J.SURENDER KUMAR,


జగిత్యాల మామిడి రైతుల కు మ్యాంగో మార్కెట్ లో  దళారుల బెడద మొదలైంది. దళారులు చెప్పిందే ధర వారి సిండికేట్  కార్యకలాపాలతో రైతాంగం నష్టపోతున్నారు.
మామిడి నాణ్యతలో జాతీయ మార్కెట్‌లో పేరు ప్రఖ్యాతలు గాంచిన జగిత్యాల ప్రాంత మామిడి కాయను ఢిల్లీ కొనుగోలుదారులు  బహిరంగ వేలం వేసి కొనుగోలు చేయాలని  కోరుతున్నారు. 

జగిత్యాల జిల్లా రైతు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు నల్ల రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజావాణిలో  కలెక్టర్ కు రైతులు ఐక్యవేదిక నాయకులు న్యాయం  గిట్టుబాటు ధర కోసం సోమవారం వినతి పత్రం ఇచ్చారు.


మామిడి రైతులకు దళారుల సమస్య తప్పించి బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేయాలని రైతు ఐక్యత రాష్ట్ర నాయకులు పన్నాల తిరుపతిరెడ్డి కోరారు..
ఈ సందర్భంగా రైతు ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ స్థానిక వ్యాపారులతో పాటు
ఆయా నగరాల నుంచి ఇక్కడికి మామిడి కొనుగోలు కోసం నెలరోజుల ముందే దళారులు కొనుగోలు చేపడతారని పట్నంలో పేర్కొన్నారు.

ఫైల్ ఫోటో.

ముంబై, ఢిల్లీ ఫ్రూట్‌ మార్కెట్‌ వ్యాపారులు వారి దళారులను రంగంలోకి దించి చౌకగా  మామిడి రకాలను కొనుగోలు చేస్తున్నా రైతులను నిలువు దోపిడి చేస్తున్నారని ఐక్య వేదిక నాయకులు వాపోయారు.

👉 దళారుల దందా..

దళారులు నెలరోజుల ముందే జగిత్యాలలో మకాం వేసి ప్రత్యేక బాక్సుల్లో ప్యాకింగ్‌ చేసి లారీలు, కంటైనర్లలో ఎగుమతులు చేస్తున్నారు పేర్కొన్నారు.
గతేడాది ఈ దళారులు రైతులతో మాట్లాడుకొని నేరుగా తోటలకు వెళ్లి కాయలను కూలీలతో కోయించి జగిత్యాల మామిడి మార్కెట్ సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న తమ స్థావరాల కు తరలించి అక్కడ బాక్సుల్లో ప్యాకింగ్‌ చేసి ఎగుమతి చేస్తున్నారు వినతిపత్రంలో పేర్కొన్నారు.


ఈ సీజన్ లో  మామిడి దిగుబడి గణనీయంగా పడిపోయింది. వాతావరణంలో సంభవించిన మార్పుల కారణంగా పూతదశలోనే రాలిపోయింది. దీంతో కేవలం 50 శాతం మాత్రమే మామిడి దిగుబడి రావడంతో ఈసారి కూడా రైతుకు నిరాశే  మిగిలిందని పేర్కొన్నారు.


దీనికి తోడు దళారుల మాయజాలంతో రైతులు తీవ్రంగా నష్టం చవిచూడాల్సి వస్తుంది..కాయ పరిమాణం తగ్గిందంటూ సాకులు చెప్పి ఫ్రూట్‌ మార్కెట్‌ ధర కంటే తక్కువగా చెల్లించి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు.
ప్రత్యేక స్థావరాలలో ముంబయి, ఢిల్లీ రాష్ర్టాల నుంచే కూలీలుగా ఇక్కడికి తీసుకువచ్చి మామిడి కాయల సైజ్‌లను బట్టి ఏ, బీ, గ్రేడ్‌ చొప్పున ప్లాస్టిక్‌ బాక్సుల్లో కాయకు కాయ తగిలి దెబ్బతిన్నకుండా మధ్యలో న్యూస్‌ పేపర్‌ పెట్టి వరుస క్రమంగా నిల్వచేస్తున్నారు.


ఈ సారి దిగుబడి పడిపోవడంతో ఉద్యానశాఖ అధికారులు దిగుబడిని అంచనా వేయలేకపోతున్నారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం పండ్ల తోటల సాగుకు రాయితీలు అధికంగా ఇస్తుండడంతో ప్రతి ఏడాది మామిడి సాగు విస్తీర్ణం పెరిగింది.


మామిడిలో మేలైన హైబ్రీడ్‌ రకాలను ఎంచుకొని మొక్కలను పేరుమోసిన నర్సరీల నుంచి తెచ్చి నాటుతున్నారు. దీంతో జగిత్యాల ప్రాంతంలో ఎటు చూసినా పచ్చగా మామిడితోటలు కనిపిస్తాయి. అని వినతిపత్రంలో పేర్కొన్నారు.


నేటి దళారుల మాయజాలంతో మామిడి రైతు కష్టం  అగామ్య గోచరంగా తయారైంది.. ఇప్పటికే అనేక చోట్ల మామిడి రైతులు మామిడి తోటలలో యాజమాన్యం పెట్టుబడితో.. దిగుబడులు రాక నష్టాలను భరించలేక చెట్లను తొలగిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.


రాబోయే కాలంలో  మామిడి మార్కెట్ కు పేరు గాంచిన జగిత్యాల ప్రాంతంలో మామిడి తోటలు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది.


ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు రంగంలోకి దిగి దళారుల చేతిలో ఉన్న మామిడి కొనుగోలును బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేయాలని రైతు ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు.. కలెక్టర్ ను కలిసిన వారిలో రైతు ఐక్యవేదిక నాయకులు ఏలేటి స్వామి రెడ్డి, బందేల మల్లన్న, కొట్టాల మోహన్ రెడ్డి, వేముల విక్రమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
.