జై బాపు – జై భీమ్ కో ఆర్డినేటర్లు నియామకం !


👉ఎమ్మెల్యే, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


జగిత్యాల జిల్లాలోని వివిధ మండలాలలో జై బాపు- జై భీమ్ -జై సంవిధాన్ కార్యక్రమానికి సంబంధించి పలు మండలాలలో కోఆర్డినేటర్లను ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ , జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నియమించారు.


జిల్లా లోని 23 మండలాలతో పాటు జగిత్యాల, ధర్మపురి, చొప్పదండి, వేములవాడ, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి  మండలాలలో  జై బాపు- జై భీమ్ -జై సంవిధాన్  కార్యక్రమాల నిర్వహణకు బాధ్యులను నియమిస్తూ, ఎమ్మెల్యే అధికారిక ప్రకటన విడుదల చేశారు.