👉 వీర హనుమాన్ విజయాత్రలో..
J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో హనుమాన్ దీక్ష పరులు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు చేసిన జైశ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో ధర్మపురి క్షేత్రం దద్దరిల్లింది.

గురువారం రోజున సాయంత్రం స్థానిక శివాజీ విగ్రహం వద్ద విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ యాత్ర నిర్వహించారు.

హనుమాన్ దీక్ష పరులు, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ నాయకుల కార్యకర్తల ఆధ్వర్యంలో క్షేత్రంలో వందలాది భారీ ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ముందు వరుసలో ఓ వాహనంలో హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటుచేసి ర్యాలీ నిర్వహించారు.
వాహనాలకు కాషాయ జెండాలు, పెట్టుకొని ధర్మపురి క్షేత్రంలో భారత్ మాతాకీ జై, తదితర నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.

శివాజీ విగ్రహం వద్ద విశ్వహిందూ పరిషత్ నాయకులు, బుగ్గారం మాజీ జెడ్పిటిసి సభ్యుడు బాదినేని రాజేందర్, బిజెపి రాష్ట్ర నాయకుడు కెమెరా రామ సుధాకర్ రావు, జెండా ఊపి ర్యాలీ ప్రారంభించడమే గాక, వారు సైతం ర్యాలీలో పాల్గొన్నారు. ఈ మేరకు ముందు వస్తదా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
👉 ఆలయానికి మైక్ సెట్ బహుకరణ !

ధర్మపురి పట్టణం తెలుగువాడ లో పురాతన ఆంజనేయస్వామి ఆలయానికి, భజన అధికారి కార్యక్రమాల నిర్వహణకు బిజెపి రాష్ట్ర నాయకుడు దామెర రామ సుధాకర్ రావు, హనుమాన్ భక్తుల కోరిక మేరకు మైక్ సెట్ ను బహుకరించడం తోపాటు, స్వాములకు దీక్ష ఏర్పాటు చేశారు.
భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా దినోత్సవ సంబరాల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 14వ వార్డులో బస్తిబాట పట్టారు రాష్ట్రంలో అధికారం లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

పట్టణ అధ్యక్షులు గాజుభాస్కర్, జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, స్తంభంకాడి శ్యామ్, తిరుమందాస్ సత్యనారాయణ, దివిట్టి శ్రీధర్, నేరెళ్ళ సంతోష్, ఆనందాస్ నవీన్, సంఘీ మాధవ్, కాశెట్టి హరీష్, నేరెళ్ల మధు, బెజ్జరాపు లవన్. నారవేణి మూర్తి మండలోజు సూరజ్. తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.