J. SURENDER KUMAR,
ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఇంచార్జ్ జర్నలిస్టు రాజేందర్ కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రామడుగు మండలం, రుద్రారం గ్రామంలో బుధవారం పరామర్శించి ఓదార్చారు.
జర్నలిస్టు రాజేందర్ మాతృమూర్తి అనారోగ్యంతో ధర్మపురిలో మృతి చెందారు. ఆమె అంత్యక్రియలు వారి స్వగ్రామం రామడుగు మండలం రుద్రారం లో జరిగాయి. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు
కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
👉 పరామర్శ..

పెగడపల్లి మండలం బతికేపెల్లి గ్రామం మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మామ కాలగిరి ముత్యం రెడ్డి బుధవారం మృతి చెందారు.
ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బత్కేపల్లి లో ముత్యం రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి మృతదేహానికి నివాళులు అర్పించారు. అంతిమయాత్రలో జీవన్ రెడ్డి , చొప్పదండి ఎమ్మెల్యే సత్యం తో కలిసి పాల్గొన్నారు.

👉 పరామర్శ..

అనారోగ్యంతో కరీంనగర్ లోనీ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పెగడపల్లి మండలం నందగిరి గ్రామానికి చెందిన సుంకరి రవిని ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించి ఆరోగ్య పరిస్థితి నీ తెలుసుకొన్నారు, వైద్యులను మెరుగైన వైద్యం అందించాలని కోరారు.