👉 తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో  కలకలం !
👉 మావోయిస్టులతో చర్చలు జరపండి ప్రొఫెసర్ హరగోపాల్ !
J.SURENDER KUMAR,
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టులు మరియు భద్రతా బలగాల మధ్య భారీ కాల్పులు చోటుచేసుకున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని కరేగుట్ట అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది.

👉 మావోయిస్టులతో శాంతి చర్చలు జరపండి
ప్రొఫెసర్ హరగోపాల్ !
భేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించిన మావోయిస్టులు ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం వారితో చర్చలు జరపాలని ప్రొఫెసర్ హరగోపాల్ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
విశ్వసనీయ సమాచారం మేరకు నక్సల్ వ్యతిరేక ప్రత్యేక బలగాలు (Greyhounds, CRPF, Telangana Police) కూబ్ ఆపరేషన్ చేపట్టిన సమయంలో మావోయిస్టుల బృందం వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.

సుమారు 30 నిమిషాల పాటు జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో రెండు వైపులా తీవ్ర కాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా దళాలు తీవ్ర ప్రతిఘటనగా ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో కొంతమంది మావోయిస్టులు హతమైనట్టు అనుమానిస్తున్నారు. 
ఘటన జరిగిన ప్రాంతంలో మావోయిస్టుల ఆచూకీ కోసం భారీగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
అధికారికంగా  వివరాలు వెల్లడి కాకపోయినా  మావోయిస్టులకు భారీ నష్టం జరిగిందని విశ్వసనీయ సమాచారం.
కాల్పుల అనంతరం సంఘటన స్థలాన్ని పరిశీలించిన భద్రతా బలగాలు అక్కడి నుంచి పేలుడు పదార్థాలు, ఆయుధాలు, మావోయిస్టుల ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
ఇటీవలే మావోయిస్టులు కరేగుట్ట ప్రాంతంలో తిరుగుబాటు కార్యకలాపాలు ముమ్మరం చేసిన నేపథ్యంలో భద్రతా బలగాలు అక్కడ భారీ నక్సల్ ఆపరేషన్ చేపట్టాయి. దాంతో మావోయిస్టులు ముందస్తుగా దాడికి దిగినట్టు భావిస్తున్నారు.
ఈ ఘటనపై జిల్లా పోలీసులు అప్రమత్తమై సరిహద్దు గ్రామాల్లో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు.
 అటవీ ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ అనుమానాస్పద వ్యక్తులపై సమాచారం అందించాలని కోరుతున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  రాష్ట్ర పౌలిస్ ఉన్నతాధికారులు ఎన్‌కౌంటర్ ప్రదేశానికి చేరుకుని పరిశీలన చేపట్టినట్టు తెలుస్తోంది.

 
													