కస్తూరి రంగన్ మృతి దేశానికి తీరని లోటు సీఎం రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ చైర్మన్, పద్మ విభూషణ్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్  మృతి దేశానికి తీరని లోటు అని ఆయన పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  సంతాపం తెలిపారు.

భారతీయ అంతరిక్ష పరిశోధనా రంగంలో కస్తూరి రంగన్  విశేష సేవలు అందించారని గుర్తుచేసుకున్నారు.
1994 నుంచి 2003 వరకు ఇస్తో చైర్మన్‌గా, ముఖ్యంగా పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ ప్రయోగాల్లో వారు పోషించిన పాత్ర దేశం మరిచిపోదని అన్నారు.

రాజ్యసభ సభ్యుడిగా, జేఎన్‌యూ వైస్ ఛాన్సలర్‌గా, కేంద్ర ప్రభుత్వ అంతరిక్ష విభాగం కార్యదర్శిగా, ప్రణాళికా సంఘం సభ్యుడిగా అనేక పదవుల్లో విశేష సేవలు అందించిన డాక్టర్‌ కస్తూరి రంగన్  మరణం దేశం ఒక గొప్ప ఖగోళ శాస్త్రవేత్తను కోల్పోయిందని పేర్కొన్నారు.

భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి  సానుభూతిని తెలియజేశారు.