J.SURENDER KUMAR,
గత కొన్ని రోజుల క్రితం పార్లమెంట్ లో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, వారిని వెంటనే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు.
జై బాపు – జై భీమ్ – జై సంవిధాన్ పాదయాత్రలో భాగంగా గురువారం రోజున పెగడపెల్లి మండలం నంచర్ల నుండి దికొండ మీదుగా ల్యాగలమర్రి వరకు నిర్వహించిన పాదయాత్రలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….
బాధ్యత గల మంత్రి పదవిలో కొనసాగుతూ అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలను చేయడాన్ని ప్రతి గ్రామ గ్రామాన తెలిపే విధంగా జై బాపు,జై భీం, జై సంవిధాన్ అనే నినాదంతో పాదయాత్ర కార్యక్రమం చేపట్టినట్టు ఎమ్మెల్యే అన్నారు.
బీజేపీ పార్టీ అణచివేత ధోరణి, కుటిల బుద్ధి బయటపడిందని, అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం వల్లనే మోడీ ప్రధానమంత్రి కుర్చీలో అమిత్ షా హోం శాఖ కుర్చీలో కూర్చున్నారని ఎమ్మెల్యే లక్ష్మణ్ అన్నారు.

నేను ఒక ఎమ్మెల్యేగా, విప్ హోదాలో కొనసాగుతున్న అంటే దానికి అంబేద్కర్ పెట్టిన బిక్ష అని, అమిత్ షా పై చర్యలు తీసుకొని వారిని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసేంత వరకు పాదయాత్ర మా పోరాటం కొనసాగుతుందని లక్ష్మణ్ కుమార్ అన్నారు.