కొండగట్టు అంజన్నకు కొండంత ఆదాయం మూడు రోజులలో కోటిన్నర !

J.SURENDER KUMAR,


ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి మూడు రోజులలోనే కొండంత ఆదాయం చేకూరింది.


వివిధ సేవల ద్వారా ₹1,67,73,800-00/-
(కోటి 67 లక్షల 73వేల ఎనిమిది వందలు) వచ్చినట్టు ఆలయ అధికారులు అధికారికంగా తెలిపారు.


  హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా  11-04-2025 నుండి 13-04-2025 వరకు ఆంజనేయ స్వామి భక్తుల రాకతో కొండగట్టు క్షేత్రం పోటెత్తింది.


👉వివిధ సేవల ద్వారా వచ్చిన ఆదాయ వివరములు


1. లడ్డు ప్రసాదముల ద్వారా ₹ 81,74,600-00

2. పులిహోర ప్రసాదముల ద్వారా ₹15,42,200-00/

3. దీక్ష విరమణల ద్వారా ₹40,17,500-00

4. కేశ ఖండన ద్వార  ₹ 11,78,000/


5 శీఘ్ర దర్శనము ద్వారా  ₹18,61,500-00


మొత్తం ఆదాయం ₹ 1,67,73,800-00 అని ప్రకటనలో పేర్కొన్నారు.