👉 శ్రీరామ గోకులం లో 72 వ
గణపతి అథర్వ శీర్ష సహస్ర అభిషేకం !
J.SURENDER KUMAR,
లోక కళ్యాణార్థం అన్యోన్య బ్రాహ్మణ సహాయం తో పవిత్ర గోదావరి తీరమైన మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట్ బ్రాహ్మణ వాడ లోని శ్రీరామగోకులం లో మే 1 న గురువారం శ్రీ వరసిద్ధి వినాయక సహిత శ్రీ రాధాకృష్ణ విగ్రహ స్థాపనలో భాగంగా గణపతి అథర్వ శీర్ష సహస్ర అభిషేకం జరుగుతుందని సహస్ర అభిషేక సమన్వయ కర్తవినోద్ కుమార్ మహావాది తెలిపారు.
ఉదయం 8.00 గంటల నుండి 72 వ గణపతి అథర్వ శీర్ష సహస్ర అభిషేకం ప్రారంభం కానున్నదని వివరించారు.
పురాణం సుజాత రామన్నల కూతురు, అల్లుడు అయిన మనోరమ గౌతం రాంపెల్లి (మంథని) వారి సౌజన్యం, సంపూర్ణ సహకారం తో జరిగే సహస్ర అభిషేకం లో వందలాది మంది వేద పండితులు పాల్గొననున్నారు.

గోదావరి నదీతీరం, గోశాల, స్వామి సన్నిధి లో జరిగే అభిషేకం లో భక్తులు అధిక సంఖ్య లో పాల్గొనాలని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించాలని మనవి. మహవాది వినోద్ కుమార్ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

👉 చెన్నూర్ లో మే 2 న…
73 వ గణపతి అథర్వ శీర్ష సహస్ర అభిషేకం మే 2 వ తేది (శంకర జయంతి), పంచ క్రోస ఉత్తర వాహిని గోదావరి తీరమైన చెన్నూర్ లోని శివాలయం (అంబా అగస్తేశ్వర) లో ఉదయం 8.00 నుండి….
👉 హైదరాబాద్ లో మే 3, 4 తేది లలో…
74 & 75 వ సహస్రం తేదీ మే 3 & 4 రెండు రోజులు హైదరాబాద్ లో సువర్ణ భారతి గోశాల ( శ్రీ శ్రీనివాస బంగారయ్య ) బైరామలగూడ లో జరగనున్నట్టు

సహస్ర అభిషేక సమన్వయ కర్త
వినోద్ కుమార్ మహావాది తెలిపారు.
కార్యక్రమ వివరాల కోసం 90000 13755. సంప్రదించాలని పేర్కొన్నారు.