J.SURENDER KUMAR,
హైదరాబాద్ రాజ్‌భవన్ లో సోమవారం జరిగిన తెలంగాణ లోకాయుక్త, ఉపలోకాయుక్త పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ లోకాయుక్తగా నియమితులైన జస్టిస్ ఎ. రాజశేఖర్ రెడ్డి , ఉప లోకాయుక్త జస్టిస్ బీఎస్ జగ్జీవన్ కుమార్ తో ప్రమాణం చేయించారు.

ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు , మహమ్మద్ అలీ షబ్బీర్ , వేం నరేందర్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు.