J.SURENDER KUMAR,
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తండ్రి, తమిళనాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గొప్ప సాహితీవేత్త కుమారి అనంతన్ ( హరికృష్ణన్ నాడార్ అనంతకృష్ణన్ ) మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
మహాత్ముడి సిద్ధాంతాలను పునికిపుచ్చుకున్న దేశ భక్తుడు, తమిళ భాషా ప్రేమికుడు అనంతన్ గారిని కోల్పోవడం ఎంతో బాధాకరం అని పేర్కొన్నారు.
కుమారి అనంతన్ నాలుగుసార్లు శాసనసభకు, ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై ప్రజలకు ఎన్నో సేవలు అందించారని గుర్తుచేశారు.
తండ్రిని కోల్పోయి దుఃఖంలో ఉన్న తమిళిసై కి, వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. అనంతన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.