మామిడి రైతులు దోపిడికి గురి అవుతున్నారు !

👉 మాజీ మంత్రి జీవన్ రెడ్డి !


J.SURENDER KUMAR,


మార్కెటింగ్ శాఖ లోపంతో జగిత్యాల జిల్లా మామిడి రైతులు దోపిడికి గురి అవుతున్నారు అని కేవలం ట్రేడర్లు వేలంలో పాల్గొంటే అది వేలమే కాదు మార్కెటింగ్ శాఖ అధికారి పర్యవేక్షణలో జరిగితేనే వేలం అనే మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో గురువారం మాజీ మంత్రి  మీడియా సమావేశంలో మాట్లాడారు.

మీడియా సమావేశంలో పాయింట్స్..

👉 మామిడి మార్కెట్లో జరిగే అవకతవకలకు మార్కెటింగ్ అధికారులదే బాధ్యత. మామిడి మార్కెట్ లక్ష్యం నీరుగారకుండా రైతులకు అండగా నిలవాలి. మార్కెట్ లోని కూలీలకు మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్య త మార్కెటింగ్ శాఖా తీసుకోవాలి.

👉 జగిత్యాల జిల్లాలో వారి సాగుతో పాటు మామిడి, ఉద్యాన వన పంటలు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. మామిడి విక్రయాల కోసం 2008-09 లో చల్ గల్ లోని 25 ఎకరాలు మామిడి మార్కెట్ కోసం కేటాయించినం.

👉 మామిడి మార్కెట్ తో ట్రేడర్లతో పాటు రైతులకు, కూలీలకు ఉపాధి కల్పించేవిధంగా మార్కెట్ ఏర్పాటు చేసినం. మామిడి రైతులు దిగుబడి తగ్గడంతో పాటు ట్రేడర్లు ట్రేడింగ్ నిబంధనలు పాటించకపోవడంతో రైతులు తీవ్రం గా ఇబ్బందులు పడుతున్నారు.

👉 మామిడిలో నాణ్యత లోపిస్తుంది అని 5 శాతం సూట్ తీస్తున్నారు.. సూట్ తీసిన తర్వాత నాణ్యత నెపం తో మళ్ళీ గ్రేడింగ్ చేయడంతో రైతులు నష్టపోతున్నారు.

👉 వేలం పద్ధతి తో మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణలో వేలం వేయకపోవడంతో వేలం నామ మాత్రమే అయింది. మార్కెట్ అధికారుల పర్యవేక్షణ కొరవడింది అధికారికంగా కమిషన్ 4 శాతం.. అని పేర్కొంటూ, 10 శాతం దాకా విధిస్తున్నారు.

👉 మార్కెట్ లోని కూలీలకు మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్య త మార్కెటింగ్ శాఖా తీసుకోవాలి. మామిడి మార్కెట్ లోని  కులీలకు వసతులు కల్పించడంలో కార్మిక శాఖ కూడా చొరవ తీసుకోవాలి.

👉 వ్యవసాయ మార్కెట్ లో వెవింగ్ బ్రిడ్జి ఉన్నప్పటికీ మామిడి రైతులు బయటకు వెళ్లాల్సి రావడం తో  రైతుల పై భారం పడుతోంది. వేలంలో ట్రేడర్లు అందరూ పాల్గొనాలి వేలం ద్వారా మాత్రమే మామిడి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

👉 నాగపూర్ మార్కెట్ లో మామిడి కాయల ధర మార్కెట్ లో బోర్డు ఏర్పాటు చేయాలి గతంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి మార్పు లేకపోవడం తో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాను.

👉 ఇప్పటికే రైతులు ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్నారు..పంటలకు మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. ఉద్యాన వన పంటలకు మద్దతు ధర లేకపోవడం తో రైతులు దోపిడికి గురికాకుండా అండగా నిలవాలి.
👉 మార్కెటింగ్ పర్యవేక్షణలో కొనసాగాల్సిన ట్రేడింగ్ ట్రేడర్ ఆద్వర్యంలో జరుగుతోంది.
మార్కెటింగ్ శాఖ ఆదాయం నష్టపోవడంతో పాటు, రైతులు పదింతలు నష్టపోతున్నారు. జిల్లా అధికారులు తరచూ మామిడి మార్కెట్ ను సందర్శించాలి.

మార్కెటింగ్ శాఖలో  నిబంధనలు పాటించేలా రెవెన్యూ అధికారినీ నియమిం చాలనీ, బాధ్యుల పై చర్యలు చేపట్టాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, స్వయంగా పరిశీలించి, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని జీవన్ రెడ్డి తెలిపారు.