👉 ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ఉగ్రవాదులు భారతదేశం వైపు కన్నెత్తి చూడటానికే భయపడేలా వారి వెన్నులో వణుకు పుట్టేలా చర్యలు ఉండాలి అని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు.
నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి పట్టణంలో గురువారం జమ్ము కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలోని పహాల్గం లోని బైసారన్ లోయలో పాకిస్థాన్ ఉగ్రవాద ప్రేరేపిత సంస్థ “The Resistance front”అనే ఉగ్రవాద ముష్కరులు పర్యటకులపై జరిపిన దాడిలో 28మంది మృతి చెందగా,20 మంది తీవ్రంగా గాయపడిన సంఘటనకు నిరసన వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సంతాప కార్యక్రమంలో నిర్వహించింది.

👉 ఈ సందర్భంగా ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
అనంత్ నాగ్ జిల్లాలోని పహాల్గం లోని బైసారన్ లోయలో పాకిస్థాన్ ఉగ్రవాద ముష్కరులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు.
ఇలాంటి పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని, భారతదేశం వైపు కన్నెత్తి చూడటానికే బయపడే విదంగా అ చర్యలు ఉండాలని, చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్ పైన తీసుకున్న కొన్ని చర్యలను, విధించిన ఆంక్షలను మేము వర్షం వ్యక్తం చేస్తున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.