మంథని నియోజకవర్గంలో ₹ 2.75 కోట్ల చెక్కుల పంపిణీ !

👉 లబ్ధిదారులకు నేరుగా CMRF, కళ్యాణ లక్మి చెక్కులు

👉 మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ….


J.SURENDER KUMAR,

మంథని నియోజకవర్గ పరిధిలో వివిధ వివిధ మండలాలలోని లబ్ధిదారులకు 676 సీఎంఆర్ఎఫ్, 21 కల్యాణ లక్ష్మి  చెక్కులు  ₹ 2 కోట్ల 75 లక్షల 10 వేల విలువైన  చెక్కులు మంజూరు చేయించిన మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంగళవారం నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేయించారు.

గత వారం రోజులు గా ప్రతి గ్రామంలో ఇంటి వద్దకు వెళ్లి మరియు క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆదేశాల మేరకు  మంత్రి వ్యక్తిగత  సహాయకుడు ఆకుల చంద్రశేఖర్  లబ్ధిదారులకు చెక్కులు అందించారు.

👉 మంథని మండలం/టౌన్ (136 చెక్కులు) ₹ 40,96,500/-

👉 ముత్తారం మండలం (85 చెక్కులు) ₹ 31,99,500/-

👉 రామగిరి మండలం (96 చెక్కులు) ₹ 34,58,000/-

👉 కమాన్ పూర్ మండలం (56 చెక్కులు) ₹ 20,23,500/-

👉 పాలకుర్తి మండలం (20 చెక్కులు) ₹ 8,34,000/-

👉 కాటారం మండలం (66 చెక్కులు) ₹ 25,08,500/-

👉 మహ ముత్తారం మండలం (32 చెక్కులు) ₹ 11,80,500/-

👉 మహదేవ్ పూర్ మండలం (50 చెక్కులు) ₹ 18,74,000/-

👉 మలహార్ రావు మండలం (70 చెక్కులు) ₹ 29,78,000/-

👉 పలిమెల మండలం (7 చెక్కులు) ₹ 2,21,500/- మరియు

👉 ఇతర మండలాలు (120 చెక్కులు)   ₹30,85,500/-
మంథని నియోజకవర్గంలోని పలువురు వివిధ ఆస్పత్రిలలో అనారోగ్యంతో చికిత్స పొంది సహాయం కొరకు మంత్రి క్యాంప్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న వారికి మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు  వీరికి ప్రభుత్వం నుండి సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేయించారు, అని మంత్రి వ్యక్తిగత సహాయకుడు చంద్రశేఖర్  తెలిపారు.


మంగళవారం మంథని, రామగిరి, ముత్తారం మండలంలోని పలు గ్రామాల్లో  సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి చెక్కులను వారి గ్రామం లో వారి వద్దకే వచ్చి లబ్ధిదారులకు చెక్కులు అందించారు.