మానవత్వం చాటుకున్న మంత్రి శ్రీధర్ బాబు !

J.SURENDER KUMAR,

బుధవారం తన మంథని నియోజకవర్గ పర్యటనలో మంత్రి శ్రీధర్ బాబు పలు  కార్యక్రమాల్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకొని మంత్రి శ్రీధర్ బాబు మానవత్వాన్ని  చాటుకున్నారు.


👉 వివరాలు ఇలా ఉన్నాయి..

మంత్రి శ్రీధర్ బాబు మహదేవ్ పూర్ మండలంలో పర్యటన ముగించుకొని సాయంత్రం  కాటారం వైపు వెళ్తుండగా మార్గమధ్యలో బొమ్మాపూర్ క్రాస్ రోడ్డు వద్ద  జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని చూశారు.


మంత్రి తన వాహనాన్ని ఆపి, క్షతగాత్రుల వద్దకు వెళ్లి భయపడాల్సిన అవసరం లేదని వారికి ధైర్యం చెప్పారు, వెంటనే  క్షతగాత్రులను   తన స్కార్పియో ప్రత్యేక వాహనంలో హాస్పిటల్ కు తీసుకెళ్లి మెరుగైన చికిత్స చేయించాలని స్థానిక పోలీసులకు సూచించారు.


ఆస్పత్రి వైద్య సిబ్బందితో మంత్రి శ్రీధర్ బాబు ఫోన్ లో మాట్లాడి రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.