మరణ హోమానికి పాల్పడ్డ ఉగ్రవాదులను మట్టుపెట్టాలి !

👉 ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

పర్యటకుల పై విచక్షణారహితంగా కాల్పులు జరిపి మరణ హోమానికి పాల్పడిన పాకిస్తాన్ ఉగ్ర ముఠాను మట్టు పెట్టాలని, ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

జమ్ము కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలోని పహాల్గం లోని బైసారన్ లోయలో మంగళవారం పాకిస్థాన్ ఉగ్రవాద ప్రేరేపిత సంస్థ “The Resistance front” అనే ఉగ్రవాద ముష్కరులు జరిపిన దాడిలో 28మంది మృతి చెందడం, 20 మందికి తీవ్ర గాయాలు కావడం మాటలకందని మహా విషాదమని లక్ష్మణ్ కుమార్ ప్రకటనలో పేర్కొన్నారు.
బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ  తక్షణమే వారికి  ఆర్థిక సహాయం అందించి బాధిత కుటుంబాలకు భరోసా కల్పించాలని కేంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.