J.SURENDER KUMAR,
జగిత్యాల పట్టణ శివారులోని మామిడి మార్కెట్ ను కలెక్టర్ సత్యప్రసాద్ గురువారం రాత్రి ఆకస్మికంగా తనఖి చేశారు.
ఈ సందర్భంగా పలువురు రైతులతో కలెక్టర్ మాట్లాడారు.
గతంలో పంటల సాగు విధానం, ప్రస్తుతం ఎంత, విస్తీర్ణంలో మామిడి పంట వేశారు, అంతర్ పంటల సాగు, దిగుబడి విధానం, నీటి వనరుల లభ్యత వంటి వివిధ అంశాలను కలెక్టర్ రైతులను అడిగి తెలుసుకున్నారు.
మామిడి సాగు విధానం, అధిక దిగుబడికి తీసుకుంటున్న చర్యలు, మార్కెటింగ్ విధానాన్ని రైతులతో ముచ్చటించారు.
కమిషన్ ఏజెంట్ లు మార్కెట్ నిబంధనల మేరకు 4 శాతం మాత్రమే కమిషన్ వసూలు చేయాలనీ అన్నారు. మార్కెట్ ప్రాంతంలో రైతులకు ట్రాఫిక్. ఇబ్బంది లేకుండా తక్షణమే తగిన సిబ్బంది ని నియమించాలి అని
అధికారులను ఆదేశించారు.