ఎమ్మెల్యేగా అవకాశం కల్పించింది అంబేద్కర్ – గెలిపించింది ప్రజలు !

👉 జై బాపు- జై భీమ్ -జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో…

👉 ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు చట్టసభలకు   రిజర్వ్ చేసిన ఎమ్మెల్యే నియోజకవర్గంలో  పోటీ చేసే అవకాశం అంబేద్కర్ రాజ్యాంగంతో వచ్చిందని, ప్రజల ఓట్లతో నేను ఎమ్మెల్యే గా గెలిచాను అని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


జై బాపు- జై భీమ్ -జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో భాగంగా శుక్రవారం  ధర్మపురి మండలం ధమ్మన్నపేట నుండి రాజారాం వరకు నిర్వహించిన పాదయాత్రలో  ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్  పాల్గొన్నారు.


👉 ఈ సందర్భంగా  ఎమ్మెల్యే మాట్లాడుతూ..


ఇటీవల పార్లమెంట్ లో  కేంద్ర మంత్రి  అమిత్ షా  రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్  పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.
వెంటనే అమిత్ షాను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని, బాధ్యత గల మంత్రి హోదాలో ఉంటూ  అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలను చేయడాన్ని కి నిరసనగా ప్రతి గ్రామ గ్రామాన తెలిపే విధంగా జై బాపు, జై భీం, జై సంవిధాన్ అనే నినాదంతో పాదయాత్ర నిర్వహిస్తున్నామన్నారు.

అట్టడుగు అణగారిన వర్గానికి చెందిన నేను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పెట్టిన భిక్షతో ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్  హోదాలో కొనసాగుతున్న అని అన్నారు. భారత రాజ్యంగాన్నీ రక్షించాలని, అంబేద్కర్ కల్పించిన హక్కులను కాపాడాలనే ఉద్దేశ్యంతో జై బాపు జై భీమ్ జై సంవిదాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నదన్నారు.


కాంగ్రెస్ పార్టీలో కుల, మత భేదం లేకుండా ఎలాంటి వర్గాలు లేకుండా పార్టీని ముందుకు నడిపించడం, జాతిపిత మహాత్మాగాంధీ గొప్పతనం, రాజ్యాంగం ఆవశ్యకతలను ప్రజలకు వివరించండమే మా ప్రధాన లక్ష్యం అని, రాజ్యాంగ విలువల పై ప్రజల్లో సంపూర్ణ అవగాహన ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.