👉 మానవత్వం చూపండి శవ రాజకీయాలు వద్దు !
👉 కాంగ్రెస్ నాయకుడు వేముల రాజేష్ !
J.SURENDER KUMAR,
జీవనోపాధి కోసం దుబాయికి వెళ్లి అక్కడ పాకిస్తాన్ వాడి చేతిలో హత్యకు గురైన ధమ్మన్నపేట కు చెందిన స్వర్గం శ్రీనివాస్ మృతదేహం దుబాయ్ నుంచి శనివారం స్వగ్రామానికి స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవతోనే రానున్నదని. ధర్మపురి మండలం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, వేముల రాజేష్ అన్నారు.
శుక్రవారం సాయంత్రం రాజేష్ విడుదల చేసిన ప్రకటనలో ఆపదలో ఉన్న వారి పట్ల మానవత్వం చూపాలి కానీ శవరాజకీయాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
దుబాయ్ లో పాకిస్తాన్ వాడి చేతిలో ఈనెల 11న హత్యకు గురి అయిన ఇద్దరు తెలంగాణ వాసులలో ధర్మపురి మండల వాసి ఉండడంతో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చడంతోపాటు కొంత మొత్తం ఆర్థిక సహాయం అందించారని పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇల్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగం, ఎన్నారై ప్రభుత్వం పాలసీ ద్వారా ₹ 5 లక్షల ఎక్స్ప్రెషన్ అందిస్తామని మృతదేహాన్ని త్వరలో తెప్పిస్తామంటూ హామీ ఇచ్చిన విషయాన్ని రాజేష్ ప్రకటనలో పేర్కొన్నారు.
👉 సీఎంకు విషయం తెలిపిన ఎమ్మెల్యే !
దుర్ఘటన సమాచారం తెలిసిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తో ” అన్నా నా నియోజకవర్గ పౌరుడు అని వివరించాడన్నారు. .దుబాయ్ నుండి మృతదేహం రావడానికి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో , గల్ఫ్ కార్మిక సంక్షేమ సలహా అధ్యయన సంఘం చైర్మెన్ డాక్టర్ బి.ఏం వినోద్ కుమార్ నిరంతరం సంప్రదింపులు జరిపిన విషయాన్ని వేముల రాజేష్ వివరించారు.

తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ ద్వారా కన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా దుబాయ్ యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అండ్ ఓవర్సీస్ ఇండియన్ ఎఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ డిల్లీ కి వైర్ మెసేజ్ ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపిన అధికారిక పత్రాలను ప్రదర్శించారు.
👉 ప్రభుత్వమే N R I పాలసీ ప్రవేశపెట్టింది.!
దేశంలో ఎన్నారై పాలసీ అధికారిక జీవో ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే తొలిసారి ఏర్పాటు చేసిందని వేముల రాజేష్ ప్రకటనలో వివరించారు.గల్ఫ్ కార్మికుల సంక్షేమం, సమగ్ర ఎన్నారై పాలసీ ఈనెల 10 న ప్రభుత్వం జీవో విడుదల చేసిందని పేర్కొన్నారు. ఇండియన్ ఫారిన్ సర్వీస్ రిటైర్డ్ అధికారి, అంబాసిడర్ డా. బి.ఎం. వినోద్ కుమార్, ఈ కమిటీ చైర్మన్ ప్రభుత్వం నియమించింది అన్నారు.

మృతదేహాలు గ్రామాలకు తరలించడానికి ప్రభుత్వం నియమించిన ఎన్నారై కమిటీ కార్యాచరణ చేపట్టినట్టు, అంబులెన్స్ సౌకర్యం, దహన సంస్కారాల నిర్వహణ తదితర అంతిమ కార్యక్రమాలు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు రాజేష్ పేర్కొన్నారు. నిర్మల్ కు చెందిన మరో యువకుడి మృతదేహం సైతం స్వగ్రామానికి ఈరోజు రానున్నది నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కి ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సమాచారం ఇచ్చిందని ప్రకటనలో పేర్కొన్నారు.
రాజకీయ పార్టీల నాయకులు శవ రాజకీయాలు చేయడం సమంజసం కాదని వారి తప్పుడు ప్రచారంతోనే వివరాలు వివరించాల్సి వచ్చిందని వేముల రాజేష్ తన ప్రకటనలో వివరించారు.
