J.SURENDER KUMAR ,
రాజ్యాంగ నైతిక విలువల గురించి నేను మాట్లాడితే ఎమ్మెల్యే సంజయ్ ఉలిక్కి పడడం ఎందుకు..మా తాతల..తండ్రుల కెళ్ళి కాంగ్రెస్ పార్టీ మాదే అంటూ.. మీకు అనుకూలంగా అవకాశం వస్తే కాంగ్రేస్ పార్టీ..అనుకూలంగా
రాకపోతే తిరుగుబాటు ఇదేనా మీ సిద్ధాంతం. అంటూ మాజి ఎమ్మెల్సీ టీజీవన్ రెడ్డి ఆరోపించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో గురువారం మాజీ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ రాజ్యాంగ రక్షణ గా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన గాంధీ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విధానాలను సమాజానికి తెలిపేందుకు బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమం చేపట్టామన్నారు.
👉 మీడియా సమావేశంలో పాయింట్స్..
👉 అప్పుడున్న పరిస్థితులలో 1962 లో డి హనుమంత రావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, టికెట్ రాని వారు ప్రతిపక్షం లో..
👉 1972 లో బలహీన వర్గాలకు చెందిన బి రాములు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే భూస్వాములు, పెట్టుబడి వర్గాలు ఒక్కటయ్యి జే దామోదర రావు బలపరచి, రాములు ను ఓడించాయి.
👉 చొక్కరావు కాంగ్రెస్ పార్టీ నీ వీడి కరీంనగర్ నుండి జనతా పార్టీ నుండి పోటీ చేశారు.
👉 మీకు అవకాశం వస్తే కాంగ్రెస్ పార్టీ..లేకపోతే ఏ రాజకీయ పార్టీ అవకాశం వస్తే.. అదేనా మీ పార్టీ..
👉 దేశంలో ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా పోరాటం చేసిన. అంజయ్య గొప్ప ప్రజాస్వామ్య వాది.
రాజకీయాలకు పంచాయతీ సమితి ఎన్నికలను ప్రత్యక్షంగా నిర్వహించడంతో నా లాంటి వారికి పోటీ చేసే అవకాశం వచ్చింది. సమితి అధ్యక్షుడిగా విజయం సాధించినా.
👉 నేను ఒక్కడిని మినహా..ఉమ్మడి కరీంనగర్ లో 14 పంచాయతీ సమితుల్లో 13 మంది అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
👉 అధికార పార్టీ కాంగ్రెస్ అయినప్పటికీ నా ఆలోచన విధానానికి అనుగుణంగా నేను పార్టీ మారలేదు.. ప్రతిపక్షంలోనే ఉన్న..
దీన్ని నేను తప్పు పట్టడం లేదు..అప్పుడున్న పరిస్థితిని.. అప్పటికి పార్టీ ఫిరాయింపు చట్టం లేదు..
👉 కాంగ్రెస్ పార్టీ మీ ఇంట్లో పుడితే బయటకు ఎందుకు పోయినట్లు..అని సంజయ్ కుమార్ ను నిలదీశారు..1984 లో నవంబర్ 23 లో ఉమ్మడి శాసన సభ రద్దు చేశారు.
👉 స్వాతంత్ర్య ఉద్యమం తర్వాత దేశం ప్రాణాలు ఇందిరా గాంధీ ప్రాణాలు అర్పించారు. ఇందిరా గాంధీ త్యాగానికి చలించిపోయి..కాంగ్రెస్ లో చేరాను.
👉 టీడీపీలో రామారావు ను విభేదించి మంత్రి పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీ లో చేరిన విషయాన్ని గమనించాలి.
👉 నాలుగు దశాబ్దాల రాజకీయంలో ఏనాడు చలించలేదు. కాంగ్రెస్ పార్టీ విధానం నాకు శిరోదార్యం..పార్టీ ఆదేశాల మేరకు 2008 లో కేసీఆర్ పై కరీంనగర్ ఎం పీ గా పోటీ చేసిన.
👉 2014 లోఉమ్మడి కరీంనగర్ నుండి ఒక్కడిని ఎన్నికయ్యను. కేవలం 24 మంది కాంగ్రెస్ సభ్యులుబుంటే అందులో నేను ఒకడిని..
👉 ప్రతిపక్ష అభ్యర్థిగా ఉంటానని తెలిసి కూడా జగిత్యాల ప్రజలు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు. జగిత్యాల ప్రజల రుణం తీర్చుకోలేనిది. నా బాధ్యత.. నా కర్తవ్యంగా భావించి బోర్నాపల్లి వంతెన అవసరం ఉందని వివరించి, నిధులు మంజూరు. చేయించగలిగాను.
👉 2019 లో పట్టభద్రులు రాజకీయాలకు అతీతంగా ఏకైక సభ్యుడిగా గెలిపించారు. ఎమ్మెల్సీ నాకు రాజకీయ జీవితంలో అత్యంత సంతృప్తిని ఇచ్చింది. శాసన మండలి లో బీ ఆర్ ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై ఒక్కడినే పోరాటం చేసిన.
👉 కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ గల సైనికుడిగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్న..రాజ్యాంగ పరిరక్షణ కోసం మాట్లాడుతున్న.
👉 కార్యకర్తలకు మనోధైర్యం చెప్పాల్సిన బాధ్యత నాపై లేదా..కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చెమటోడ్చి అధికారంలోకి తీసుకు వచ్చారు.
👉 బిఆర్ఎస్ 10 ఏళ్లు దౌర్జన్యం చేశారు.బీ ఆర్ ఎస్ దౌర్జన్యం తట్టుకోలేక యువకుడు సారంగాపూర్ అడవుల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు నిజం కాదా..?
👉 కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడి పై రౌడీ షీట్ ఓపెన్ చేయించారు.టీ ఆర్ ఎస్ లో చేరనందుకు తుంగురు సర్పంచ్ ను సస్పెండ్ చేయించారు..
👉 ఇంకా మీ దౌర్జన్యం గురించి ఎన్ని చెప్పాలి..
ఇవి చాలవా..ఐదేళ్లు పరోక్షంగా..మరో ఐదేళ్లు ప్రత్యక్షంగా పాలన చేశారు కదా ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని సంజయ్ కుమార్ కు జీవన్ రెడ్డి సవాలు విసిరారు.
👉 డబుల బెడ్రూమ్ ఆవిర్భావం ఎక్కడి నుండి వచ్చింది.. ఈ ఆలోచన విధానానికి రూపకల్పన చేసింది నేను..జగిత్యాల పట్టణంలో ఇల్లు లేని నిరుపేద ఉండకూడదని ప్రభుత్వ భూమితో పాటు రైతుల నుండి భూమి సేకరించి, వారసత్వంగా ఆస్తి అనుభవించేలా200 ఎకరాల్లో 4000 వ్యక్తిగత ఇళ్లు మంజూరు చేయించి, నిర్మాణం చేపట్టినం.
👉 అప్పుడు కేటాయించిన ఇండిపెండెంట్ హౌస్ విలువ ప్రస్తుతం రెండు లక్షల కన్నా అధికముగా ఉన్నది..
స్వతంత్రంగా ఇంటిని పూర్తి చేస్తే జీవన్ రెడ్డి కి, కాంగ్రెస్ ఎక్కడ పేరు వస్తుందో అని, ఇళ్లు కూల్చి వేసి, డబుల్ బెడ్రూమ్ చేపట్టడం నిజం కాదా..అని నిలదీశారు. వాస్తవాలు చర్చకు రావాలి..
👉 డబుల్ బెడ్రూమ్ లో మౌలిక వసతుల కల్పన కోసం లబ్ధిదారులతో సమావేశం నిర్వహించి
నిధుల మంజూరు కోసం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన.
👉 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లబ్ధిదారులకు ఎన్నికల కు ముందే పట్టాలు పంపిణీ చేశారు కదా.. కేసీఆర్ కు సన్నిహితునివి కదా..మౌలిక వసతులు ఎందుకు కల్పించలేదు..నిధులు ఎందుకు తీసుకురాలేదు..
👉 జగిత్యాల లో మెడికల్ కళాశాల ఏర్పాటు విధాన పరమైన అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేశారు.రాష్ట్రంలో అన్ని నియోజక వర్గాలలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగానే జగిత్యాలలో ఏర్పాటు చేస్తున్నారు.
👉 రాష్ట్రంలోని అన్ని ఐటిఐ కలశాలలు మంత్రి శ్రీధర్ బాబు అప్గ్రేడ్ చేశారు. అభివృద్ధి ప్రజాస్వామ్యం లో పౌర హక్కు..
👉 అభివృద్ధి చేయడానికి ఏ ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదు..బోర్నపల్లి వంతెన ప్రజల హక్కుగా భావించి కెసిఆర్ నుండి మంజూరు తీసుకువచ్చి, 70 కోట్ల నిధులు మంజూరు చేయించిన.
👉 ఉమ్మడి రాష్ట్రంలో జేఎం టియు ఒకటే కేటాయిస్తే అది జగిత్యాలలో జే ఎం టీ యూ కలశాల ఏర్పాటు చేసిన. వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేసిన. కోరుట్ల లో రత్నాకర్ రావు వెటర్నరీ కలశాల ఏర్పాటు చేశారు శాతవాహన యూనివర్సిటీ మంజూరు చేయించిన. నాక్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసిన.
👉 రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జగిత్యాల లో నిరంతరం నీటి సరఫరా చేసిన. తైబజార్ చిట్టి రద్దు చేయించిన.అధికారంలో ఉన్నప్పుడు బలహీన వర్గాల హక్కులు కాపాడాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు.
👉 ఏం పీ టీ సీ మృతి చెందితే ఆ సీటు ఖాళీ గా ఉందని మండల అధ్యక్ష పదవి భర్తీ చేయలేదు.
జగిత్యాల మున్సిపాలిటీ ఛైర్పర్సన్ కు మాససిక క్షోభతో రాజీనామా చేశారు.
👉 బలహీన వర్గాల హక్కులు కాపాడాలని రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో పంచాయతీ రాజ్ చట్టంలో సవరణ చేపట్టి, స్థానాలు భర్తీ చేశారు.
👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ పెద్దల సహకారం తో రాయికల్, పొలస, బీర్పూర్ సీపీడబ్ల్యు స్కీమ్ కోసం 15 కోట్లు మంజూరు చేయించిన.
👉 కేంద్రం ఎన్నికల పంచ్ న్యాయ్ లో రాహుల్ గాంధీ భాగంగా పార్టీ ఫిరాయిస్తే సభ్యత్వం రద్దు చేయాలన్నారు.
👉 కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి ఏవిధముగా కట్టుబడి ఉందో..ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన వారికి ప్రాధాన్యత ఇస్తామని మీనాక్షి నటరాజన్ స్పష్టంగా చెప్పారు..
👉 ఎవరు ఎన్ని ఆడాంకులు సృష్టించినా కాంగ్రెస్ పార్టీ నీ బలోపేతం చేయడమే నా లక్ష్యం.
రాహుల్ గాంధీ నీ ప్రధాన మంత్రి నీ చేయడమే ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లక్ష్యం. అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.
