మోదీకి చెప్పుకోండి ప్రాణాలతో విడిచిపెడుతున్నాం !

 👉 నన్ను ప్రాణాలతో వదిలేస్తున్నామన్నారు.

👉నా భర్తను కళ్లముందే దారుణంగా కాల్చేశారు

👉 కర్నాటకకు చెందిన పల్లవి ఆవేదన !

J.SURENDER KUMAR,

బొమ్మనహళ్లి కి చెందిన పల్లవి

భర్త, కుమారునితో కలిసి తిరిగారు.

అప్పటిదాకా  పాటోలు, వీడియోలు

కాసేపటికి వాళ్ల కళ్లముందే ఉగ్రవాదుల

తూటాలకు బలయ్యాడు.

కర్నాట కలోని శివమొగ్గకు చెందిన

మంజునాథ్ రావు 47 ఏళ్ల రియల్టర్ విషాదాంతమిది.

విహారయాత్ర కోసం భార్య పల్లవి, కుమారునితో వెళ్లారు.  మంజునాథ్ తూటాలకు బలి అయ్యాడు. భార్య, కుమారుడు  ఉగ్రవాదులు తనును కావాలనే వదిలేశారని పల్లవి రోదిస్తూ వివరించంది .


దాడి సమయంలో దాదాపు 500 మంది పర్యాటకులం ఉన్నాం, మేము  గుర్రాలు దిగి నా కొడుకు తినేందుకు ఏమైనా దొరుకుతుందా అని నా భర్త దగ్గర్లోని హోటల్లో కి వెళ్లారు.  నా కొడుకు తో పాటు నేను హోటల్ కి వెళ్తుండగా  కాల్పుల శబ్దం వచ్చింది. ఆర్మీ జవాన్లు కాల్పులు జరుపుతున్నారనుకున్నాం. కానీ జనం పరుగులు చూసి నేను కూడా పరిగెత్తాను. అప్పటికే నా భర్త రక్తపు మడుగులో పడి ఉన్నాడు..

👉 బిస్మిల్లా..బిస్మిల్లా..

ముగ్గురు ఉగ్రవాదులు బిస్మిల్లా, బిస్మిల్లా అంటున్నారు. వాళ్లు హిందువులను మాత్రమే లక్ష్యం చేసుకున్నారు. మగవారిని తీవ్రంగా కొట్టారు. “నా భర్తను ఎందు కింత దారుణంగా హత్య చేశారు. నన్నూ చంపేయండి అన్నాను. మా అమ్మను, నన్ను కూడా చంపండి రా అని నా కొడుకు కూడా గట్టిగా అరిచాడు. అయినా వాళ్ల గుండెలు కరగలేదు

👉 మిమ్మల్ని చంపము..

మిమ్మల్ని చంపము. ఇక్కడ జరిగింది  పోయి మీ మోదీకి చెప్పుకొమ్మన్నారు.  మా కర్మ కొద్దీ ఇక్కడికొచ్చాడంటూ ఆమె గుండెలవిసేలా రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.

👉 పాల్గొన్నది ఐదుగురు ముష్కరులు !

ప్రాణభయంతో తలో దిక్కు వరుగులు తీశారు. చుట్టూ మైదాన ప్రాంతం కావడంతో కనీసం దాక్కోవడానికి వీలు కూడా లేకుండా పోయింది. ఈ క్రమంలో రెండు పర్యటకుల  బస్సులకు కూడా ఉగ్రవాదులు అడ్డుకున్నట్టు సాక్షులు తెలిపారు. వారిని ఒక్కొక్కరిగా ఉగ్రవాదులు బస్సుల్లోంచి కిందకు దించారు.


హిందువులను మాత్రమే టార్గెట్ చేశారు. పేర్లు అడిగారు, పేర్లు తప్పు  చెప్పారని అనుమానం వస్తే ప్యాంట్లు విప్పించి ముర్మాంగాలను చూసి నిర్ధారించుకొని  తర్వాత పాయింట్ బ్యాంక్ రేంజ్ లో కాల్చారు.. దాదాపు 30 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయారు.. 20 మందికి పైగా గాయపడ్డారు. పర్యటకుల క్షతగాత్రుల అర్ధనాదాలు అరణ్యరోధనలుగా అయ్యాయి.  మృతదేహాల వద్ద మహిళలు గుండెలవిసేలా దోచిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

“నా భర్త తలలో తూట దూసుకెళ్లింది. నా కళ్ళ ముందు నా భర్త కన్నుమూశాడు” అంటూ ఓ మహిళ హృదయవిదారకంగా విలపించింది.

👉 27 మంది మృతి

స్విట్జర్లాండ్ పేర్కొంటున్న జైనరన్ ప్రాంతాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేశారు.
40 మంది పర్యాటకులను అటవీప్రాంతం నుంచి వచ్చిన ఉగ్రవాదులు ఒక్కసారిగా  చుట్టుముట్టారు. ఆ తర్వాత విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
పహల్గామ్ లో అమర్నాథ్ యాత్రికుల క్యాంప్ ఉంటుంది. ఇప్పటికే అమర్నాథ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యింది. ఇదే సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపింది.

👉 మహిళా సమాచారంతో..

ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడ్డ ఓ మహిళా పర్యటకురాలు సమాచారం ఇవ్వడంతో కాల్పుల ఘటన గురించి అధికారులకు అందింది.
ఉగ్రవాదుల కాల్పుల్లో పర్యాటకులతో పాటు స్థానికులకు కూడా గాయాలైనట్టు తెలుస్తోంది.  జమ్ములోని కొన్ని ప్రాంతాల్లో అసలు ఉగ్రవాదుల జాడ ఉండదు, పహల్గామ్ కూడా అందులో ఒకటి.

ఇక్కడికి దేశ విదేశాల నుంచి టూరిస్టులు తరలి వస్తుంటారు. మార్చిలో  మంచు కురియడంతో ప్రాంతానికి టూరిస్టులు వస్తుంటారు. ట్రెక్కింగ్ వెళ్లిన టూరిస్టులను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
38 రోజులపాటు కొనసాగే  అమర్నాద్ యాత్ర జులై ప్రారంభం కానున్నది. దేశవ్యాప్తంగా లక్షలాదిమంది యాత్రీకులు రెండు మార్గాల్లో ఇక్కడకు చేరుకుంటారు. 

👉 దాడిలో మృతి చెందిన హైదరాబాద్ వాసి!

కాశ్మీర్ ఉగ్రదాడి లో హైదరాబాద్ వాసి మృతి చెందారు.  హైదరాబాద్ కు  చెందిన మనీష్ రంజన్.. తన భార్య ఇద్దరి పిల్లలతో కలిసి హాలిడే ట్రిప్ కోసం జమ్మూ కాశ్మీర్ కు వెళ్లారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో మనీష్ చనిపోయాడు. ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. హైదరాబాద్ లో మనీష్ రంజన్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో విధులు నిర్వహిస్తున్నారు.


( టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో )