J.SURENDER KUMAR,
శాసనసభ వ్యవహారాలు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బుధవారం నాంపల్లి కోర్టు లో జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ న్యాయమూర్తి ముందు హాజరయ్యారు.
కాలేశ్వర ప్రాజెక్టు నిర్మాణంలో భూములు, గృహాలు కోల్పోయిన బాధితులకు నిబంధనల మేరకు నష్టపరిహారం ఇవ్వాలి అంటూ 2017లో నాటి టిఆర్ఎస్ ప్రభుత్వంను డిమాండ్ చేసిన అప్పటి మంథని ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి శ్రీధర్ బాబు పై పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీస్ లు కేసు నమోదు చేశారు.
అప్పటి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తోపాటు హర్కల వేణుగోపాల్, అన్నమయ్య గౌడ్, శశి భూషణ్ కాచే, లతో మరో 9 మందిపై ఐపిసి 147, 353, 427, రెడ్ విత్ 149 సెక్షన్లు తో కేసు నమోదు చేశారు.