నవ భారత నిర్మాణంలో జగ్జీవన్ రామ్ పాత్ర కీలకం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

👉 డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ  జయంతి కార్యక్రమంలో…

J.SURENDER KUMAR,

స్వాతంత్ర్య సమరయోధుడి గా మాత్రమే కాకుండా, స్వాతంత్ర్యం అనంతర నవభారత నిర్మాణంలో అపూర్వమైన సేవలు అందించి కీలక పాత్ర వహించిన మహనీయుడని డా. బాబు జగ్జీవన్ రామ్ అని  ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి  లక్ష్మణ్ కుమార్
అన్నారు.


శనివారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో  మంచినీళ్ల భావి చౌ రాస్తా సమీపంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ  జయంతి కార్యక్రమంలో   ప్రభత్వ విప్  లక్ష్మణ్ కుమార్,  అడిషనల్  కలెక్టర్  లత, అధికారులు, పుర ప్రముఖులు  దళిత  నాయకులు ఆయన  విగ్రహానికి పూలమాలలు వేసి  ఘనంగా  నివాళులు  అర్పించారు.

👉 ఈ సందర్బంగా  ఏర్పాటు  చేసిన సమావేశం లో  ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ..

సమానత్వం, సామాజిక న్యాయం కోసం అహర్నిశలు శ్రమించిన డా.బాబు జగ్జీవన్ రామ్ జీవితం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలవాలని   లక్ష్మణ్ కుమార్ అన్నారు.
1908 ఏప్రిల్ 5న జన్మించిన ఆయన, స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని, అనంతరం దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకుడిగా నిలిచారని తెలిపారు.

ఆయన అత్యంత కాలం కేబినెట్ మంత్రిగా కొనసాగిన ఘనత గల నేత మాత్రమే కాకుండా, భారత మాజీ ఉప ప్రధాన మంత్రి గా, కార్మిక శాఖ మంత్రిగా, వ్యవసాయ మంత్రిగా, రక్షణ మంత్రిగా వివిధ కీలక బాధ్యతలు నిర్వహించారని అన్నారు .


వ్యవసాయ మంత్రిగా పనిచేసి గ్రీన్ రివల్యూషన్‌ను సమర్థవంతంగా అమలు చేసి దేశాన్ని ఆహార ధాన్యాల పరంగా స్వయం సమృద్ధిగా మార్చిన వారని పేర్కొన్నారు. రక్షణ మంత్రిగా ఇండో-పాక్ యుద్ధ సమయంలో భారతదేశానికి విజయాన్ని సాధించిపెట్టడంలో ఆయన నాయకత్వం విశేషమని, బంగ్లాదేశ్ స్వాతంత్ర్యంలో ఆయన పాత్రను మరువలేమని అన్నారు.


సామాజిక  విప్లవానికి ఆయన చేసిన కృషి అపూర్వమని, డా.బి.ఆర్.అంబేద్కర్  తీరునే ఆయన కూడా అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడారని తెలిపారు. అంటరానితనాన్ని నిర్మూలించేందుకు చేసిన కృషి సమాజానికి దిశానిర్దేశకంగా నిలిచాయని అన్నారు.
నేటి యువత ఆయన జీవితం నుండి ప్రేరణ పొందాలాని, ఆయన ఆదర్శాలను అనుసరించాలని ఆయన అన్నారు.

👉 అడిషనల్ కలెక్టర్  లత మాట్లాడుతూ,

ఆయన జీవితంలో అంటరానితనం పరిస్థితుల నుంచి ఉప ప్రధాని పదవి వరకు అనేక అంశాలను చూశారని తెలిపారు.
చిన్నతనంలో పాఠశాలలో అంటరానితనం సమస్యతో అనేక బాధలు అనుభవించారని, 29 ఏళ్ళ వయస్సులో శాసన మండలి సభ్యునిగా, 1937 లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి బీహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యారని తెలిపారు.


1946లో తాత్కాలిక ప్రభుత్వంలో మంత్రి గా పని చేశారని, స్వాతంత్ర్య వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో 30 సంవత్సరాల పాటు వివిధ మంత్రిత్వ శాఖలలో పని చేశారని తెలిపారు. ‌


వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో  మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మాజీ మున్సిపల్ కమిషనర్ విజయలక్ష్మి ఆర్డీవో మధుసూదన్ డిఎస్పి రఘు చందర్ మున్సిపల్ కమిషనర్ రెవెన్యూ  అధికారులు , జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి రాజ్ కుమార్, పేట భాస్కర్ బంగారు దీపక్ బొల్లి శేఖర్ , బెజ్జంకి సతీష్ బొల్లె గంగారం మాజీ సర్పంచ్, మకిలి ఇజ్రాయిల్, దారా రమేష్ బాబు, భువనగిరి నారాయణ, బోనగిరి దేవయ్య, అక్క జీవన్ ,మేకల పవన్, ఎస్సీ, బీసీ, ఎస్టీ సంఘ, వివిధ సంఘాల నాయకులు,  ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు,ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు