👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR
మా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నక్సలిజాన్ని ఒక సామాజిక కోణంలో మాత్రమే చూస్తుందని, ఇది శాంతి భద్రతల అంశంగా పరిగణించదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపే విధంగా చొరవ తీసుకోవాలని శాంతి చర్చల కమిటీ ముఖ్యమంత్రిని కోరింది. కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్ , ప్రొ. హరగోపాల్ , ప్రొ. అన్వర్ ఖాన్ , దుర్గాప్రసాద్ , జంపన్న , రవి చందర్ ముఖ్యమంత్రి ని జూబ్లీహిల్స్ నివాసంలో ఆదివారం కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని, కాల్పుల విరమణకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే విధంగా ప్రయత్నాలు చేయాలని ప్రతినిధులు ముఖ్యమంత్రి ని కోరారు.
గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం సీనియర్ నేత జానారెడ్డికి ఉందని, ఈ విషయంలో మంత్రులతో పాటు జానారెడ్డి సలహాలు, సూచనలను తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేంరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.