నియోజకవర్గ అభివృద్ధికి ₹ 5 కోట్ల నిధులు కేటాయించండి !

👉 ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


బీటి రోడ్లు, వాగుల పై వంతెనలు, తదితర అభివృద్ధి పనుల కోసం CRR గ్రాంట్ కింద పాలు పనులకు ₹ 5.20 కోట్ల నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతూ ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కు వినతి పత్రం  ఇచ్చారు.


హైదరాబాదులో సోమవారం, ఎమ్మెల్యే లు విజయరమణ రావు , మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తో కలిసి  రాష్ట్ర పంచాయతీ రాజ్  శాఖ మంత్రి శ్రీమతి సీతక్క ను మంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు.

పెగడపెల్లి మండలం లోని మద్దులపల్లి  నుండి పందులగుట్ట గ్రామం వరకు  వంతెన నిర్మాణానికి ₹ 2 కోట్ల రూపాయలను,  ధర్మారం తెనుగువాడ నుండి ఎండపెల్లి x రోడ్  ( కొత్తపల్లి బిటి రోడ్ నుండి ఎండపెల్లి బిటి రోడ్ )వరకు బిటి రోడ్ నిర్మాణానికి ₹ 3.20 కోట్ల రూపాయలు మొత్తంగా ₹ 5.20 కోట్ల రూపాయలను మంజూరు చేయాలని పేర్కొన్నారు. 

వినతి పత్రంపై మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారని  ఎమ్మెల్యే తెలిపారు.