ప్రముఖ సినీ దర్శకుడు హరీష్ శంకర్ బంధు వర్గంలో విషాదం

J.SURENDER KUMAR,


దక్షిణాది రాష్ట్రాలలో ప్రముఖ సినీ దర్శకుడు హరీష్ శంకర్  బందు వర్గంలో విషాదం చోటు చేసుకుంది.
దర్శకుడు హరీష్ శంకర్,  బాబాయ్. ( తండ్రికి స్వయాన సోదరుడు) ముంబాయిలో ప్రముఖ పురోహితుడు ఉమా శంకర్ శర్మ (69) బుధవారం గుండెపోటుతో మృతి చెందారు
.


ఉమాశంకర్ శర్మ  దహన అంతిమ సంస్కారాలు స్వగ్రామం  ధర్మపురిలోని  పవిత్ర గోదావరి నది తీరంలో గురువారం జరిగాయి. ఈ సందర్భంలో హరీష్ శంకర్ ధర్మపురి కి చేరుకొని తన బాబాయ్ అంతిమ సంస్కార  కార్యక్రమాలలో  పాల్గొన్నారు.