J.SURENDER KUMAR,
ప్రపంచ సుందరి 2025 పోటీకి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మే 10 న నుంచి ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ 2025 ఏర్పాట్లపై మంగళవారం అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.
👉 హైదరాబాద్ లో 72 వ మిస్ వరల్డ్ నిర్వహణకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్ల వివరాలను సమావేశంలో అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు.
👉 కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసే అతిథుల కోసం ఎయిర్ పోర్టు, వారు బస చేసే హోటళ్లు, కార్యక్రమాలు నిర్వహించే ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి పోలీసు అధికారులను ఆదేశించారు.
👉 తెలంగాణలోని చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు అతిథుల ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కార్యక్రమాలకు సంబంధించి విభాగాల వారిగా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు.
👉 నగరంలో పెండింగ్ లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని, మిస్ వరల్డ్-2025 ప్రారంభమయ్యే నాటి నుంచి పూర్తయ్యే వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, పూర్తి చేయాల్సిన పనులు, ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.