👉 బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో…
J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి పట్టణంలో గురువారం సాయంత్రం బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ యాత్ర ( శోభాయాత్ర ) జరగనున్నట్టు విశ్వహిందూ పరిషత్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు బోయిన పద్మాకర్ తెలిపారు.
శివాజీ చౌక్ నుండి శోభాయాత్ర ప్రారంభమై పట్టణ పురవీధుల గుండా తిరిగి హనుమాన్ విగ్రహం వద్ద ముగుస్తుంది ప్రకటనలో పేర్కొన్నారు.

శోభాయాత్రలో ధర్మపురి పట్టణ మరియు పరిసర గ్రామాల నుండి హిందూ బంధువులను, హనుమాన్ స్వాములకు కరపత్రములు స్వాగతించినట్టు వివరించారు.
వీర హనుమాన్ శోభాయాత్రలో పది అడుగుల భారీ. విగ్రహంతో ఊరేగింపు జరుగుతుందని వారు పేర్కొన్నారు.
ఇందులో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బోయిని పద్మాకర్ , బజరంగ్దళ్ జిల్లా సంయోజక్ కల్లెడ రోహిత్ కుమార్ లు శోభాయాత్రకు మార్గదర్శనం చేస్తారు అని ప్రకటనలో పేర్కొన్నారు.

హనుమాన్ విజయాత్ర ఏర్పాట్లను అల్లం దుర్గాప్రసాద్, కస్తూరి రాజన్న, ఎలగందుల బుచ్చన్న, వెలగందుల రవి, గాదె లక్ష్మణ్, ఇరిశెట్టి మనీష్, ఆసం సురేష్, ముత్తినేని రాజేష్ అంబడి లక్ష్మణ్, జంగ్లీ రాజేందర్, శ్రీనివాస్ దివిటి శ్రీకాంత్ , భోగ రమేష్, తదితర ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్దళ్ తదితరు కార్యకర్తలు పాల్గొన్నారు