👉 ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కులుస్తాం అంటూ కొందరు సోయిలేని మాటలు మాట్లాడుతున్నారని, వారికి ప్రభుత్వాన్ని టచ్ చేసే దమ్ము ధైర్యం ఉందా ? అని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సవాల్ చేశారు.
శుక్రవారం జరిగిన పెగడపెల్లి మార్కెట్ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్, వైస్ చైర్మన్ సత్తిరెడ్డి మరియు డైరెక్టర్ల తో జిల్లా మార్కెట్ అధికారి ప్రమాణ స్వీకారాన్ని చేయించారు, అనంతరం నూతనంగా నియామకమైన పాలకవర్గ సభ్యులను ఎమ్మెల్యే సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

👉 ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
ధర్మపురి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను రాష్ట్రప్రభుత్వం కేటాయించిందని, మరిన్ని ఇండ్లను కేటాయించాలని సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా,మంత్రి సానుకూలంగా స్పందించినట్టు మంత్రి తెలిపారు.
సంవత్సర కాలంలో 56 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీచేసి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపామని, అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని..రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని.

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా చేసి, ఖాళీ ఖజానాను అప్పజెప్పిన ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామన్నారు.
ఎమ్మెల్యేలు, సంపన్నులు తినే సన్న బియ్యాన్ని దేశంలో ఎక్కడలేని విధంగా రేషన్ ద్వారా పంపిణీ చేస్తున్నామని, రేషన్ షాపుల వద్ద ప్రధాని మోడీ బొమ్మ పెట్టాలని డిమాండ్ చేస్తున్న బిజెపి నాయకులు, బీజేపీ పాలిత రాష్ట్రం మహారాష్ట్రలో సన్న బియ్యం పంపిణీ చేయాలని, సీఎం రేవంత్ రెడ్డి పాలనను చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.