రైతుల కోరిక మేరకే  ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు !

👉 ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,

రైతులు కష్టపడి పండించిన పంటల కొనుగోలు కోసం ప్రభుత్వ యంత్రాంగం రైతుల కోరిక మేరకే  వారు కోరిన స్థలంలో, గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


వెల్గటూర్ మండలం కోటిలింగాల, సంకెనపల్లి ఎండపెల్లి మండలం అంబారిపేట, పైడిపల్లి, గోడిసేలపేట్  గ్రామాల్లో సోమవారం నూతనంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.


ఈ సందర్భంగా రైతుల వడ్లు కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.