J.SURENDER KUMAR,
రైతాంగం కష్టపడి పండించిన ధాన్యం కు గిట్టుబాటు ధరతో పాటు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రంకు త్వరలో ప్రభుత్వ స్థలం కేటాయించడానికి కృషి చేస్తానని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
పెగడపెల్లి మండలం అరవెల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాని ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం ప్రారంభించారు.
👉ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

తమ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు నా దృష్టికి తీసుకువచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్ తో మాట్లాడి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు.
రైతులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులూ లేకుండా అధికారులు ధాన్యం కొనుగోళ్లు కొనసాగించాలని, త్వరలోనే వివాదం లేని ప్రభుత్వ స్థలాన్ని కొనుగోలు కేంద్రం కొరకు అప్పగించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
