👉 తెలుగు పండిట్ గుండె శంకర్ పదవి విరమణ సభలో.
J.SURENDER KUMAR,
సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ధర్మపురి పట్టణం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన తెలుగు పండిట్ గుండి శంకర్ పదవి విరమణ సన్మాన మహోత్సవానికి హాజరైన వక్తలు తమ తమ ప్రసంగంలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ…
విద్యార్థుల మేధాశక్తినిపెంచే ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలన్నారు. గుండి శంకర్ సేవలనువారు కొనియాడారు. శంకర్ దంపతులను శాలువా, పూలమా లతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొలిచాల శ్రీనివాస్ , డి సి ఎం ఎస్ చైర్మన్ ఎల్లలా శ్రీకాంత్ రెడ్డి, రిటైర్డ్ ఎస్పి మాదాసు రమేష్ బాబు, మాజీ వైస్ చైర్మన్ ఇందారపు రామయ్య , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సంఘనబట్ల దినేష్ , సంఘ నర్సింహులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు ఆనందరావు, యాళ్ళ అమరనాథ్ రెడ్డి, రఘు శంకర్ రెడ్డి, సుధా రాజేందర్, నారాయణ రెడ్డి, రామ్ రెడ్డి, గాదె శ్రీనివాస్, దహేగం గణేష్, మండల విద్యాధికారులు సీత లక్ష్మీ , భీమయ్య, బుగ్గారపు కిషోర్, తదితరులు పాల్గొన్నారు.