👉 ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
రాష్ట్రంలో సామాన్య పేద ప్రజలకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్, రేషన్ షాపుల్లో ఉచిత సన్న బియ్యం పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన తీరుకు ప్రత్యక్ష నిదర్శనం అని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకం కార్యక్రమంలో భాగంగా మంగళవారం బుగ్గారం వెల్గటూర్ మండలాలలోని గ్రామంలోని రేషన్ దుకాణాల్లో ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులు మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులకు అధికారులతో కలిసితో సన్నబియ్యాన్ని పంపిణీ చేశారు.
అనంతరం బుగ్గారం మండలంలోని గంగాపూర్ గ్రామంలో సామాన్య కుటుంబానికి చెందిన రెంటెం మల్లయ్య నివాసంలో ప్రభుత్వం ఉచితంగా అందించిన సన్నబియ్యం భోజనాన్ని నాయకులతో కలిసి సహపంక్తి భోజనం చేసి మల్లయ్య కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే ముచ్చటించారు.

👉 అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.
అర్హులైన ప్రతి పేదవారికి కొత్త రేషన్ కార్డులను కూడా త్వరితగతిన అందజేసే విధంగా ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటామని, పది సంవత్సరాలు అధికారంలో ఉన్న గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వ పాలకులు పేద ప్రజలకు సన్నబియ్యాన్ని పంపిణీ చేయలేదని, దరఖాస్తు చేసుకున్న ప్రతి పేదవారికి నూతన రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని, ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ₹ 500 లకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, మహిళలకు ఉచిత RTC బస్సు ప్రయాణం వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని, పెద వారికి పంపిణీ చేసే సన్న బియ్యం పంపిణీ విషయంలో అధికారులు ఎక్కడ నిర్లక్ష్యం వహించరాదని ఈ సందర్భంగా అధికారులను ఎమ్మెల్యే కోరారు.
👉 వెల్గటూర్ మండలకేంద్రంలో…

రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకం కార్యక్రమంలో భాగంగా మంగళవారం వెల్గటూర్ మండలకేంద్రంలో రేషన్ దుకాణాల్లో ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని పంపిణీ చేశారు.

మండలానికి చెందిన 24 మంది లబ్ధిదారులకు దాదాపు ₹ 24 లక్షల కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.