ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం !

👉 ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలకు శ్రీకారం చుట్టిందని. ప్రత్యేకంగా ప్రభుత్వ గురుకులాలలో, వసతి గృహాలలో విద్యార్థులు సంక్షేమం పట్ల ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నదని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


ధర్మారం మండల కేంద్రంలోని గిరిజన మినీ గురుకుల (బాలికలు) పాఠశాలలో దాదాపు ₹ 10 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన డైనింగ్ హాల్ ను అధికారులు మండల నాయకులతో కలిసి గురువారం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.


👉ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..


రాష్ట్ర ప్రభుత్వం విద్య వ్యవస్థకు పెద్ద పీట వేసిందని, విద్యార్థులకు డైట్ చార్జీలను, కాస్మొటిక్ చార్జీలను పెంచడం, హాస్టల్లో మౌలిక వసతులను కల్పించడం వంటి ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే చేపట్టడం జరిగిందన్నారు.


ధర్మపురి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాల ముఖ్యమంత్రి  మంజూరు చేశారన్నారు.  డిగ్రీ కళాశాల, ఐటీఐ కలశాల ను కూడా మంజూరుకు సీఎం రేవంత్ రెడ్డికి వివరించినట్టు సీఎం తన అభ్యర్థులపై సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు.


విద్యార్థులకు సంబంధించి డైట్ విషయంలో కూడా ఎక్కడ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని, అధికారులు కూడా ఎప్పటికప్పుడు విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందుతుందో లేదో  ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఎప్పుడూ ఎటువంటి అవసరం ఉన్న నా దృష్టికి తీసుకురావాలని ఈ సంధర్బంగా ఎమ్మెల్యే అధ్యాపక బృందాన్ని కోరారు.