ఎస్సీ ఎస్టీ ల సమస్యలు మానవ కోణంలో పరిష్కరించాలి !

👉ఎస్సీ ఎస్టీ  కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య !


J.SURENDER KUMAR,


ఎస్సీ ఎస్టీ ప్రజల సమస్యలను అధికార యంత్రాంగం మానేయ కోణంలో స్పందించి పరిష్కరించాలని   తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ  కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.
జగిత్యాల కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శుక్రవారం ఎస్సీ ఎస్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలపై  చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యులు నీలాదేవి, శంకర్, రాంబాబు నాయక్, లక్ష్మి నారాయణ లతో కలిసి సమీక్షించారు.


కమిషన్ చైర్మన్ సభ్యులకు అడిషనల్ కలెక్టర్ బి ఎస్ లత సాదరంగా స్వాగతించారు. అనంతరం వారు గార్డెన్ ఆఫ్ ఆనర్ స్వీకరించారు.
  జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను, విద్య, వైద్యం సంక్షేమ రంగంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలకు అందిస్తున్న సదుపాయాలను అడిషనల్  కలెక్టర్ వివరించారు.


ఈ సందర్బంగా చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ ….


జిల్లాలో  ఎస్సీ ఎస్టీ  సబ్ ప్లాన్ నిధులు పూర్తి గా వారికే కేటాయించాలని, నిధులు పక్కదారి పడకుండా చూడాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో  రూల్ అఫ్ రిజర్వేషన్ తప్పకుండ పాటించాలని అన్నారు  ఎస్సీ ఎస్టీల ల అభ్యున్నతి కి అధికారులు ప్రత్యేక  దృష్టి సారించాలని అన్నారు..


ఎస్సీ ఎస్టీ  సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌళిక వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వారికి సంబదించిన భూములపై కేసులు త్వరగా పరిష్కరించాలని అన్నారు.


అట్రాసిటీ చట్టం పై అధికారులు ప్రజలకి అవగాహన కల్పించాలని అన్నారు . ప్రతినెల చివరి రోజున ఖచ్చితంగా పౌర హక్కుల దినోత్సవం జరిగేలా చూడాలని, హెడ్ కానిస్టేబుల్, ఆర్ ఐ ల ద్వారా నిర్వహిస్తున్నారని అలా చేయకుండా తహసీల్దార్, ఎస్ ఐ లు పౌరహక్కుల దినోత్సవంకు  హాజరు అయి ప్రజలకి చట్టం పై అవగాహన కల్పించాలని సూచించారు.


ధర్మపురి శాసన సభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..


విద్యా హక్కు చట్టాన్ని  అమలుకు కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలి అని అన్నారు. గాదేపల్లి పరిధిలో ప్రభుత్వ భూములను కొంతమంది ఆక్రమించారాని, ఆ భూములను పరిరక్షించాలని కోరారు.


మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ…


విద్యా చట్టాన్ని తూచ తప్పకుండ పాటించాలని కోరారు.  ప్రయివేట్ విద్యా సంస్థలలో పేదలకు 25 శాతం  సీట్ల ను ఖచ్చితంగా కేటాయించాలని అన్నారు.