ఎస్సీ వర్గీకరణ గెజిట్ నోటిఫికేషన్‌ విడుదల !

👉 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి రోజున.!

👉 సీఎం రేవంత్ రెడ్డికి అందజేసిన తొలి గెజిట్ ప్రతి !


J.SURENDER KUMAR,


సామాజిక న్యాయం కోసం అందరికీ సమాన అవకాశాలను కల్పించాలన్న లక్ష్యంతో, సోమవారం డా. బీఆర్ అంబేద్కర్ జయంతి రోజు ప్రజా ప్రభుత్వం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కి మంత్రివర్గ ఉపసంఘం జీవో తొలి కాపీని అందజేసింది.


మంత్రివర్గ సహచరులకు,మంత్రి దామోదర రాజనర్సింహకు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మిఠాయి తినిపించారు.


డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , దామోదర రాజనర్సింహ , పొన్నం ప్రభాకర్ , పొంగులేటి శ్రీనివాసరెడ్డి , ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి , ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జి. చిన్నారెడ్డి , ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ , ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ , పోరిక బలరాం నాయక్ , ఉన్నతాధికారులు పాల్గొన్నారు.