J.SURENDER KUMAR,
రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ లో భాగంగా వెల్లటూరు మండలం స్తంభంపల్లి గ్రామం దళిత కాలనీలో నిర్వహించిన శ్రమదానం కార్యక్రమంలో ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండల నాయకులతో
కలసి పాల్గొన్నారు.
అనంతరం స్తంభంపెల్లి గ్రామంలో కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

రాజ్యాంగం ప్రాముఖ్యతను మరియు దాన్ని యొక్క ఫలాలను అందరికీ అందించాలనే ఉద్దేశంతో రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ లో భాగంగా రెండు రోజుల సర్వోదయ సంకల్ప శిబిరం మరియు శ్రమదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని,

బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎంతో మంది పోరాటం చేసి దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగిందని దేశంలో ఉన్న అన్ని వర్గాల వారికి సమన్యయం చేకూర్చే విధంగా బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.
👉 సర్వోదయ సంకల్ప శిబిరం లో

రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ స్థంబంపెల్లిలోని స్థానిక హరిత హోటల్లో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు రెండు రోజుల పాటు జరిగిన “సర్వోదయ సంకల్ప శిబిరం” ముగింపు కార్యక్రమం లో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కార్యక్రమ అసెంబ్లీ ఇంచార్జి సిద్దేశ్వర్ మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు.
👉 పరామర్శ !

పాశిగామ గ్రామానికి చెందిన కంటెం తిరుపతి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఒక కాలును కోల్పోయారు. తిరుపతి ఎమ్మెల్యే పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
