👉 అవాస్తవ పోస్టులను ఫార్వర్డ్ చేస్తే క్రిమినల్ కేసులు !
👉 డీఎస్పీ రఘు చందర్ !
J.SURENDER KUMAR,
సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై, జగిత్యాల జిల్లా పోలీస్ యంత్రాంగం ఉక్కు పాదం మోపనున్నది.
👉 వాస్తవాలను తెలుసుకోకుండా అలాంటి పోస్టులను ఫార్వర్డ్ చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని శనివారం డిఎస్పీ రఘు చందర్ ప్రకటనలో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజ, నిజాలు తెలుసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో అట్టి మెసేజ్ లను ఫార్వర్డ్ చేయకూడదని ప్రకటనలో పేర్కొన్నారు.
👉 సోషల్ మీడియా పై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా తో పాటు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సోషల్ మీడియా విభాగం ప్రతి పోస్టు ను నిశితంగా పరిశీలించడం జరుగుతుందని తెలిపారు.

👉 కొందరు ఇతర దేశాలలో ఉంటూ సోషల్ మీడియాలో ఏం చేసినా తమకేం కాదన్న ధీమాతో సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు పెడుతున్నారని.. అలాంటి వారిపైనా కేసులు నమోదు చేసి లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి పాస్ పోర్టులు, వీసాలను కూడా చట్టపరంగా రద్దు చేయించొచ్చని ప్రకటనలో పేర్కొన్నారు.
👉 ఇప్పటికే ఇలాంటి పోస్టులను వాట్సాప్ మరియు ఫేస్బుక్ ల ద్వారా చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేశామన్నారు.
సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టుల పై ఎలాంటి అనుమానలు , సందేహాలు ఉన్న జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని సంప్రదించాలని ప్రజా భద్రత ,లా & ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ప్రజలు శాంతి యుత జీవనం గడిపేల చూడడం జగిత్యాల జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం గారి చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.