సోనియా రాహుల్ గాంధీ పేర్లు ఈడి చార్జిషీట్ లో చేర్చడం బిజెపి కుట్ర !

👉 ప్రభుత్వ విప్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


నేషనల్ హెరాల్డ్ అంశంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అధికారులు ( E D ) తమ చార్జిషీట్ లో కాంగ్రెస్ అగ్రనేతలు  సోనియా, రాహుల్ గాంధీ పేర్లు చేర్చడం వెనక బిజెపి కక్ష పూరిత కుట్ర ఉందని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్
అడ్లూరి లక్ష్మణ్ కుమార్
అన్నారు .


ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అగ్ర నేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లు ఛార్జ్ షీట్ లో చేర్చడాన్ని నిరసిస్తూ  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ ఈడి కార్యాలయం ముందు  చేపట్టిన ధర్నా, ఆందోళన కార్యక్రమంలో  ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్  పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..


రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం  బీసీ కులగణ సర్వే చేసి అమలుకు శ్రీకారం చుట్టడంతో
రానున్న గుజరాత్ రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఆదరణ పెరుగుతుందో అని కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు కుట్ర పూరితంగా కాంగ్రెస్ పార్టీనీ బలహీన పర్చాలనే ఉద్దేశంలో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు.


  జనాభా ప్రాతిపాదికన అందరికీ సమాన అవకాశాలు, న్యాయం జరగాలనే నినాదంతో తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, బట్టి విక్రమార్క, పిసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్   ఆధ్వర్యంలో బి.సి కులగణన చేసి  అమలు చేయడం తో బిజెపిలో ఆందోళన మొదలైంది అన్నారు.


  రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ,  రాహుల్ గాంధీ లను బిజెపి ప్రభుత్వం ఇదే తరహా వేధింపులకు పాల్పడితే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బిజెపిపై రాజీ లేని పోరాటం చేస్తారని  లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు.

.