శ్రీనివాస్ అంతిమ యాత్రలో పాడే మోసిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

👉 దుబాయ్ నుంచి స్వగ్రామం దమ్మన్నపేటకు చేరుకున్న శ్రీనివాస్ మృతదేహం !


J.SURENDER KUMAR ,


దుబాయిలో పాకిస్తాన్ వాడితో హత్యకు గురి అయిన స్వర్గం శ్రీనివాస్ మృతదేహం శనివారం స్వగ్రామం ధర్మపురి మండలం  దమ్మన్నపేటకు చేరుకుంది. 

శ్రీనివాస్  అంతిమ యాత్ర, దహన సంస్కారాల కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్  పాడే మోశారు . శ్రీనివాస్ కుటుంబానికి ₹ 10 వేల  ఆర్థిక సహాయాన్నీ  ఎమ్మెల్యే అందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…


ఉపాధి కోసం దుబాయ్ వెళ్ళిన శ్రీనివాస్  అక్కడ హత్యకు గురికావడం చాలా బాధాకరమనీ, విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో, చీఫ్ సెక్రటరీతో మరియు సంబంధిత అధికారులతో మాట్లాడి అధికారికంగా ఎంబెన్సీ అధికారులకు  శ్రీనివాస్ భౌతికకాయాన్ని స్వదేశానికి పంపే ప్రక్రియను త్వరగా పూర్తి చేయడం  జరిగిందన్నారు.


శ్రీనివాస్ కుటుంబానికి NRI పాలసీ కింద ₹ 5 లక్షల ఎక్స్ గ్రేషియా తో పాటు కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం, ఇందిరమ్మ ఇళ్లును మంజూరు చేస్తానని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు.


👉 దహన సంస్కారాల కు  ₹ 15 వేలు !

శ్రీనివాస్  దహన సంస్కారాల ప్రభుత్వ పక్షాన జిల్లా కలెక్టర్ ₹ 15 వేల రూపాయలు, వ్యక్తిగతంగా తాను ₹ 10 వేల రూపాయలను మొత్తంగా ₹ 25 వేల రూపాయలను అందించామని ఎమ్మెల్యే తెలిపారు.  భవిష్యత్తులో శ్రీనివాస్ కుటుంబానికి ప్రభుత్వం  అన్ని విధాల అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.