శ్రీ రామపట్టాభిషేకాని కి హాజరైన తెలంగాణ గవర్నర్ !

J.SURENDER KUMAR,


దక్షిణ అయోధ్య” గా ఖ్యాతిగాంచిన భద్రాచలంలో సోమవారం అంగరంగ వైభవంగా జరిగిన శ్రీరామచంద్ర స్వామి పట్టాభిషేక మహోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరై, స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు.

పట్టాభిషేక మహోత్సవంలో  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ,ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.